ETV Bharat / bharat

కుటుంబంలో ఐదుగురు అంధులే.. భిక్షాటనే దిక్కు.. కలెక్టర్ చొరవతో..

author img

By

Published : Apr 10, 2023, 10:51 PM IST

ఆరుగురు ఉన్న ఆ కుటుంబంలో ఐదుగురు అంధులే. ఈ కారణంగా వారు ఏ పని చేయలేరు. ఒక్క వ్యక్తి వారిని పోషించడమూ భారమయ్యింది. భిక్షాటన చేయడమే వారికి మిగిలి ఉన్న దారి. ఈ కుటుంబ దీన పరిస్థితిపై ఆ జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. ఈ ఘటన ఎక్కుడ జరిగిందంటే..

5 of 6 member family are blind dm lends help
5 of 6 member family are blind dm lends help

ఆ కుటుంబంలో ఆరుగురు సభ్యులు... అందులో ఐదుగురికి కళ్లు కనిపించవు... కంటి చూపు లేనందున ఈ ఐదుగురు ఎలాంటి పని చేయలేరు... వీరందరికీ భిక్షాటన ఒక్కటే మార్గం... కానీ, వీరి పరిస్థితి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. ఈ కుటుంబ పరిస్థితిని మార్చేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ పథకాలు సైతం అందని ఈ కుటుంబంలో వెలుగులు నింపారు.
బంగాల్​, మాల్దా జిల్లాలోని ఇస్లాంపుర్ గ్రామంలో బబ్లూ హక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పుట్టుకతోనే అతడికి అంధత్వం ఉంది. అతడి సోదరి ఇస్మతారా ఖాతున్ సైతం కంటి చూపు లేకుండానే జన్మించింది. బబ్లూ హక్ ఇద్దరు కుమారులు ఇమ్రాన్, సోలేమాన్​, కుమార్తె సబీనాకు సైతం అంధత్వం వచ్చింది. ఈ కుటుంబంలో కంటి చూపు ఉన్నది.. బబ్లూ భార్య షెఫాలీ బీబీకి మాత్రమే. ఈమెనే కుటుంబానికంతా ఆధారం.

"వ్యవసాయం చేసే నా తండ్రి నాకు ఇల్లు కట్టి ఇవ్వడం వల్ల మేమంతా ఇక్కడే ఉంటున్నాం. నా సోదరిని ఎవరూ వివాహం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. మాకు ఇప్పటికీ ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. నా పిల్లలు పెద్ద అవుతున్నారు. మాకు ప్రభుత్వం నుంచి సాయం కావాలి. దీనిపైనే జిల్లా మేజిస్ట్రేట్​ను కలిసి అభ్యర్థించాం."
-బబ్లూ హక్

ఈ కుటుంబ పరిస్థితిపై ఇస్లాంపుర్​ గ్రామ పంచాయతీ సభ్యుడు హురున్​ రషీద్​ స్పందిచాడు. ఆ కుటుంబంలో అందరి వివరాలు పంచాయతీ కార్యాలయంలో సమర్పించారని తెలిపాడు. తాము పంచాయతీ వల్ల సాధ్యమయినంత సహాయం చేస్తామని హామీ ఇచ్చాడు.

5 of 6 member family are blind dm lends help
అంధులకు సహాయం అందిస్తున్న మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా
ఈ గ్రామంలో ప్రభుత్వ క్యాంప్ ఏర్పాటు చేయగా.. జిల్లా మేజిస్ట్రేట్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. బబ్లూ హక్ కుటుంబ పరిస్థితిపై తమకు సమాచారం అందిందని మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా వెల్లడించారు. 'గ్రామంలోని ఓ కుటుంబంలో ఐదుగురికి కంటి చూపు లేదు. అందులో ఇద్దరికి ప్రభుత్వం నుంచి పెన్షన్ సైతం రావడం లేదు. ఆ సమస్యను పరిష్కరించాం. వీరికి ఓ ఇల్లు అవసరం ఉంది. వచ్చే ఏడాది వీరికి ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టించి ఇస్తాం. ప్రభుత్వ వైద్యుల ద్వారా వీరికి పరీక్షలు జరిపిస్తాం. బంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టులో భాగంగా చికిత్స జరిపిస్తాం. బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యుత్ శాఖ.. వీరి ఇల్లుకు ఎప్పుడో కరెంట్ కనెక్షన్ కట్ చేసింది. పెండింగ్ బిల్లులో సగం కట్టాలని బబ్లూను కోరాం. కానీ, అది కూడా కట్టలేనని చెప్పారు. దీంతో ఆ డబ్బు కూడా మేమే కట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజే కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాం. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందేలా చూస్తాం' అని నితిన్ సింఘానియా వివరించారు.
5 of 6 member family are blind dm lends help
అంధులతో మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.