ETV Bharat / bharat

అంగవైకల్యాన్ని ఓడించిన యువతి.. నెట్​ పరీక్షలో 99 శాతం స్కోర్

author img

By

Published : Nov 8, 2022, 2:28 PM IST

Updated : Nov 8, 2022, 2:43 PM IST

ఏ ఆధారం లేనివారికి అక్షరమే ఆయుధం అని మరోసారి రుజువైంది. ఆమె పుట్టుకతోనే దివ్యాంగురాలు.. సరిగ్గా పెన్​ కూడా పట్టుకుని రాయలేదు. అయినా సరే ఆ యువతి యూనివర్సిటీ గ్రాంట్​ కమీషన్​ నిర్వహించిన నెట్​ పరీక్షలో 99.31 శాతం సాధించింది.. బంగాల్​కు చెందిన ఓ దివ్యాంగురాలు.

Nadia girl Piyasha
యూజీసీ-నెట్​లో 99.31 స్కోర్​

యూజీసీ-నెట్​లో 99.31 స్కోర్​

'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అన్న వ్యాఖ్యాన్ని నిజం చేసింది ఓ దివ్యాంగురాలు. పక్కవారి సహాయం లేకపోతే కనీసం అడుగు కూడా వేయలేదు. కానీ తన పట్టుదల, సంకల్పంతో.. అక్షరాలను అందిపుచ్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగింది. అంగవైకల్యాన్ని అధిగమించిన ఆ అమ్మాయి.. జాతీయ అర్హత పరీక్ష(నెట్​)లో 99.31 శాతం సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

బంగాల్​ నదియాలోని శాంతిపుర్‌కు చెందిన పియాషా మహల్దార్ అనే అమ్మాయి పుట్టుకతోనే దివ్యాంగురాలు. కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. బాల్యం నుంచి తనంతట తానుగా కదలలేని పరిస్థితి. అయినా సరే పియాషాకు చదువంటే చాలా ఆసక్తి. అదే ఇప్పుడు ఆమెను ఈ విజయం సాధించేలా చేసింది. స్కూల్​, కాలేజీలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సెప్టెంబర్ 23న యూజీసీ నిర్వహించిన జాతీయ అర్హతా పరీక్షను కళ్యాణి పరీక్షా కేంద్రంలో రాసింది. నెట్​ పరీక్ష సైతం.. కంప్యూటర్​ ముందు బోర్లా పడుకుని రాసింది. సోమవారం ఫలితాలు వెలవడగా.. బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్​ సాధించింది పియాషా.

Nadia girl Piyasha
పియాషా మహల్దార్​

"సెప్టెంబర్ 23న పరీక్ష జరగగా దాని ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. నేను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్​నకు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు పీహెచ్​డీ చేయాలని ఉంది. ఈ​ పర్సంటేజ్​తో దేశంలోని ఏ యూనివర్సిటీలోనైనా తప్పకుండా సీటు వస్తుంది. ప్రస్తుతం అసిస్టెంట్​ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలుగుతున్నాను."

- పియాషా మహల్దార్, దివ్యాంగురాలు

పియాషా బెంగాలీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా మారడమే లక్ష్యంతో నెట్ పరీక్ష రాసింది. దాని కోసమే రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. తన కష్టానికి తగిన ఫలితం దక్కింది. అయితే.. పియాషా సాధించిన స్కోరుతో దేశం ఎక్కడైనా పీహెచ్​డీ చేయవచ్చు. కానీ తన అంగవైకల్యం కారణంగా ఇంటికి దగ్గరగా ఉన్న కళ్యాణి యూనివర్సిటీలోనే పీహెచ్​డీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పియాషా సాధించిన విజయం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.

Last Updated :Nov 8, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.