ETV Bharat / bharat

భాజపా నుంచి నవీన్​ జిందాల్​ బహిష్కరణ.. నుపూర్​ శర్మ సస్పెండ్​

author img

By

Published : Jun 5, 2022, 5:15 PM IST

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అల్లర్లకు కారణమవుతున్నారనే కారణంగా దిల్లీ మీడియా విభాగం నేత నవీన్​ కుమార్​ జిందాల్​ను పార్టీ నుంచి బహిష్కరించింది భాజపా. జాతీయ అధికార ప్రతినిధి నుపూర్​ శర్మను పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. ఏదైనా వర్గం లేదా మతాన్ని అవమానించే భావజాలానికి భాజపా పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేసింది.

BJP suspends Nupur Sharma
భాజపా నుంచి నవీన్​ జిందాల్​ బహిష్కరణ

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధులు నుపూర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌పై చర్యలు తీసుకుంది భారతీయ జనతా పార్టీ. జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆందోళనలకు దారి తీశాయనే కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది క్రమశిక్షణా కమిటీ. 'వివిధ అంశాల్లో పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నాం.' అని పేర్కొంది.

మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మతసామరస్యం దెబ్బతినేందుకు కారణమవుతున్నారని, పార్టీ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించారనే కారణంతో పార్టీ దిల్లీ మీడియా హెడ్​ నవీన్​ కుమార్​ జిందాల్​ను పార్టీ నుంచి బహిష్కరించారు. "మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దయింది. మీరు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు." అని నవీన్​ జిందాల్​కు పార్టీ దిల్లీ అధ్యక్షుడు అదేశ్​ గుప్తా నుంచి సందేశం అందింది.

అలాంటి భావజాలానికి భాజపా వ్యతిరేకం: మతపరమైన వ్యక్తులను అవమానించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా ఓ ప్రకటనలో పేర్కొంది. వేల సంవత్సరాల భారత చరిత్రలో ప్రతి ఒక్క మతం వికసించి వర్ధిల్లినట్లు తెలిపింది. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్న భాజపా.. ప్రముఖ వ్యక్తులను అవమానించటాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. ఏ ఒక్క వర్గం లేదా మతాన్ని అవమానించే భావజాలానికి భాజపా పూర్తిగా వ్యతిరేకమని.. అలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులను లేదా అభిప్రాయాలు కలిగినవారిని తమ పార్టీ ప్రోత్సహించదని భాజపా స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: బ్రేకప్​ రివెంజ్.. ప్రేయసి ముఖంపై తన పేరును టాటూగా వేసిన ఉన్మాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.