ETV Bharat / bharat

భాజపా ఎంపీ కారుపై బాంబు దాడి.. 'కశ్మీర్​ ఫైల్స్'​ చూసొస్తుండగా!

author img

By

Published : Mar 20, 2022, 3:41 AM IST

BJP MP Attacked: తన కారుపై బాంబు దాడి జరిగిందని ఆరోపించారు బంగాల్ ఎంపీ జగన్నాథ్ సర్కార్​. 'ది కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రం చూసిన అనంతరం తిరుగు ప్రయాణంలో దుండగులు కారుపై బాంబు విసిరినట్లు చెప్పారు.

BJP MP attacked
The Kashmir Files

BJP MP Attacked: బంగాల్​లో భాజపా ఎంపీ కారుపై బాంబు దాడి అంశం కలకలం రేపింది. 'ది కశ్మీర్​ ఫైల్స్' సినిమా చూసి తిరిగి వస్తుండగా తన కారుపై దుండగులు బాంబు విసిరారని భాజపా ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఆరోపించారు. నదియా జిల్లాలోని హరింఘటా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

BJP MP attacked
జగన్నాథ్ సర్కార్

"'ది కశ్మీర్​ ఫైల్స్'​ సినిమా చూసి తిరిగి వస్తుండగా.. నా కారుపై దుండగులు బాంబు విసిరారు. కొద్దిలో తప్పించుకున్నాం. కాస్త దూరం వెళ్లాక కారు ఆపి.. తిరిగి చూశాం. మరో 10 నిమిషాలకు ఘటనా స్థలికి పోలీసులు వచ్చారు."

- జగన్నాథ్ సర్కార్, భాజపా ఎంపీ

BJP MP attacked
కారుపై దాడి

బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలి..

"బంగాల్​ ఎవరికీ భద్రత లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యం పతనమైంది. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే రాష్ట్రపతి పాలన విధించడమే మార్గం." అని జగన్నాథ్ పేర్కొన్నారు.

BJP MP attacked
దాడి గుర్తులు

ఇవీ చూడండి:

'ద కశ్మీర్​ ఫైల్స్' దర్శకుడికి వీఐపీ సెక్యూరిటీ

ట్యాక్స్ ఫ్రీ.. ఉద్యోగులకు లీవ్.. టాప్​ రేటింగ్స్​.. 'కశ్మీర్​ ఫైల్స్' ఎందుకింత స్పెషల్?

కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్​ ఫైల్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.