ETV Bharat / bharat

థౌజండ్​ లైట్స్​ నుంచి ఎన్నికల బరిలో ఖుష్బూ

author img

By

Published : Mar 14, 2021, 12:56 PM IST

Updated : Mar 14, 2021, 3:19 PM IST

BJP likely to field Khushboo Sundar from 'Thousand Lights' seat in Tamil Nadu
థౌజండ్​ లైట్స్​ నుంచి బరిలో ఖుష్బూ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్​ లైట్స్​ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున సినీ నటి ఖుష్బూ.. బరిలోకి దిగనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.

ఇటీవలే భాజపాలో చేరిన సినీనటి ఖుష్బూ సుందర్​.. థౌజండ్​ లైట్స్​ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించింది. తమిళనాట 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై శనివారం జరిగిన భాజపా సీఈసీ భేటీలో తుది జాబితా ఖరారైందని సమాచారం.

కొన్ని నెలల క్రితం కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరిన ఖుష్బూను చెపాక్-ట్రిప్లికేన్​ నియోజకవర్గానికి ఇన్​ఛార్జ్​గా నియమించింది భాజపా. ఈ నియోజకవర్గం నుంచే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే.. కూటమిలో భాగంగా ఈ స్థానం పీఎంకేకు వెళ్లింది.

ఇదీ చూడండి: తమిళనాట సీట్ల సర్దుబాటుతో తారలు డీలా

Last Updated :Mar 14, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.