ETV Bharat / bharat

'నక్సలైట్​' మామ కూల్చేసిన బడిలో కోడలు పాఠాలు

author img

By

Published : Oct 2, 2022, 8:01 AM IST

అది బిహార్‌లో ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో ధ్వంసమైన ప్రాథమిక పాఠశాల. కొన్నేళ్లుగా మూతపడిన ఆ విద్యాలయం ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతోంది.

Naxal leader daughter in law teaches students
'నక్సలైట్​' మామ కూల్చేసిన బడిలో కోడలు పాఠాలు

అది బిహార్‌లో ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో ధ్వంసమైన ప్రాథమిక పాఠశాల. కొన్నేళ్లుగా మూతపడిన ఆ విద్యాలయం ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతోంది. ఈ మార్పు వెనుక ఉన్నది స్వయానా ఓ నక్సలైట్‌ కోడలు.
2007లో జముయీ జిల్లాలోని చొర్మరాలో ఉన్న ఆ పాఠశాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన బాలేశ్వర్‌ కోడా అనే నక్సలైట్‌ కోడలు రంజూ దేవి. ఆమె స్వయంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.

Naxal leader daughter in law teaches students
'నక్సలైట్​' మామ కూల్చేసిన బడిలో కోడలు పాఠాలు

అంతేకాదు.. తన మామ బాలేశ్వర్‌ నక్సల్‌ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడంలోనూ ప్రత్యేక చొరవ చూపింది రంజూ దేవి. ఆమె మాట ప్రకారమే బాలేశ్వర్‌ తన అనుచరులతో కలసి ఈ ఏడాది జూన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. విద్య ద్వారా పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నందుకు ఆనందంగా ఉందని రంజూ దేవి పేర్కొంది.

Naxal leader daughter in law teaches students
చొర్మరాలోని పాఠశాల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.