ETV Bharat / bharat

'కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షలు!'

author img

By

Published : Jan 5, 2022, 3:17 PM IST

Updated : Jan 5, 2022, 3:31 PM IST

Bihar covid deaths ex gratia: కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించాలని బిహార్ కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజా కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.

bihar covid deaths ex gratia
bihar covid deaths ex gratia

Covid deaths ex gratia Bihar: కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది బిహార్ ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్రాలు రూ.50 వేల పరిహారాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని బిహార్ ప్రకటించడం విశేషం.

Nitish kumar Janta darbar news

మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని పట్నాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను సీఎం నితీశ్ కుమార్ రద్దు చేసుకున్నారు. సమాజ్ సుందర్ అభియాన్, జనతా దర్బార్​ను తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్​లో పలువురికి కరోనా సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Bihar covid update

బిహార్​లో కరోనా తీవ్రంగానే ఉంది. వారం రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో 2,222 యాక్టివ్ కేసులు ఉండగా.. పట్నాలోనే 1,250 మంది బాధితులు ఉన్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని వైద్యులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. పట్నాలోని నలంద బోధనాస్పత్రిలో మరో 59మంది డాక్టర్లకు పాజిటివ్​గా తేలింది. సోమవారం ఇదే హాస్పిటల్​లో 72మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో ఇక్కడ వైరస్ సోకిన వైద్యుల సంఖ్య 218కి చేరింది. జనవవరి 1-2మధ్య ఈ ఆస్పత్రిలో 87మంది వైద్యులు కరోనా బారినపడటం గమనార్హం.

అదే సమయంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు రేణూ దేవీ, తారా ప్రసాద్ కిశోర్​కు కొవిడ్ సోకింది. మంత్రులు సునీల్​ కుమార్​, విజయ్ చౌదరి, అశోక్ చౌదరికి సైతం కరోనా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: మోదీ పంజాబ్ పర్యటనలో సెక్యూరిటీ ప్రాబ్లం- హుటాహుటిన దిల్లీకి..

Last Updated : Jan 5, 2022, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.