ETV Bharat / bharat

నెటిజన్ల మనసుదోచిన నీలి రంగు పాము

author img

By

Published : Sep 19, 2020, 7:12 PM IST

మనిషి కళ్లు దాదాపు కోటి వరకు రంగులను చూడగలవు. అయితే వాటిలో నీలం వంటి కొన్ని రంగులు మాత్రమే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తాజాగా పచ్చని పూదోటలో విరబూసిన రోజారేకులపై సేదతీరిన ఓ పాము.. నీలివర్ణంతో ఆకట్టుకుంటోంది.

blue pit wiper snake
నెటిజన్ల మనసుదోచిన నీలి రంగు పాము

అరుదైన కొన్ని జీవులు వాటి రంగు, పరిమాణాలతో ఇట్టే ఆకర్షిస్తుంటాయి. అలాంటి కోవకి చెందిందే 'బ్లూ పిట్ వైపర్‌' అనే బుల్లి పాము. నీలి వర్ణంలో మెరిసిపోతూ ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. గులాబీ పువ్వు చుట్టూ అల్లుకుపోయిన ఈ చిన్ని పాము వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన అనేకమంది నెటిజన్లు పాము భలే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

జంతువుల వీడియోలు, ఫొటోలు షేర్‌ చేసే 'లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌' ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. ఆకర్షణీయంగా కనిపించే బ్లూ పిట్ వైపర్‌ ఓ విషపూరితమైన సరీసృపం. ఈ పాములు ఇండోనేసియా, తూర్పు తైమూర్‌ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని మాస్కో జూ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కోతి దెబ్బకు పులుల గుంపు పరార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.