ETV Bharat / bharat

కరోనాపై పోరు: భారత్​కు అమెరికా ఆర్థిక సాయం

author img

By

Published : Apr 17, 2020, 11:04 AM IST

ప్రపంచానికి పెను ముప్పుగా మారిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. మొత్తం 5.9 మిలియన్ల డాలర్లను అందిస్తున్నట్లు తెలిపింది.

US provides nearly USD 5.9 million in health assistance to India on COVID-19
కరోనా పోరులో భారత్​కు చేయూతగా అమెరికా

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. యూఎస్​ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) ద్వారా 5.9 మిలియన్‌ డాలర్లను ఇవ్వనుంది.

కరోనా బాధితులకు చికిత్స, ఇతర సాయం అందించడం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన ప్రచారం చేయడం, కొత్త కేసులు కనుగొనడం, నిఘాను మరింత పటిష్ఠం చేయడం వంటి చర్యలు చేపట్టేందుకు ఈ నిధుల్ని భారత్​ ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది అమెరికా విదేశాంగ శాఖ.

గత 20 ఏళ్లలో అమెరికా దాదాపు 2.8 బిలియన్ల డాలర్లను భారత్​కు సాయం అందించింది. ఇందులో 1.4 బిలియన్ల డాలర్లు వైద్య సాయం కింద ఇచ్చింది.

పాక్​కు ఐఎంఎఫ్​ సాయం..

కరోనా కారణంగా పాకిస్థాన్​కు అత్యవసర ఆర్థిక సాయం కింద 1.386 బిలియన్ల డాలర్లను సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి గురువారం ఆమోదం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.