ETV Bharat / bharat

'సార్వత్రిక' మూడో దశలో 64.66% ఓటింగ్

author img

By

Published : Apr 23, 2019, 5:45 PM IST

Updated : Apr 23, 2019, 9:29 PM IST

భారత్​ భేరి: మూడో దశ పోలింగ్​ సమాప్తం

పశ్చిమబంగాలో ఘర్షణలు మినహా మూడో విడత పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. ఈవీఎం మొరాయింపు సమస్య ఈ రోజూ కొనసాగింది. మూడో దశ పోలింగ్​లో 64.66 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

భారత్​ భేరి: మూడో దశ పోలింగ్​ సమాప్తం

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్​ స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంల సమస్య మళ్లీ పునరావృతమైంది. బిహార్​, కేరళలో ఉదయం ఎలక్ట్రానిక్ ఓటింగ్​ యంత్రాలు మొరాయించాయి. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.

మూడో విడత పోలింగ్​లో 64.66 శాతం ఓటింగ్​ నమోదైంది. క్యూలైన్లో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించింది ఈసీ. పూర్తి పోలింగ్​ శాతంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆయా రాష్ట్రాల్లో పోలింగ్​ శాతం

  • అసోం: 71.47 %
  • బిహార్​: 54.91 %
  • గోవా: 70.90 %
  • గుజరాత్​: 58.96 %
  • జమ్ము కశ్మీర్​: 13.61 %
  • కర్ణాటక: 60.42 %
  • కేరళ: 70.28 %
  • మహారాష్ట్ర: 57.01 %
  • ఒడిశా: 61.00 %
  • త్రిపుర: 77.28 %
  • ఉత్తరప్రదేశ్​: 56.71%
  • బంగాల్​: 78.97 %
  • ఛత్తీస్​గఢ్​: 64.68%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 71.43%
  • దమణ్ దీవ్​​: 65.34 %

ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు..

దేశవ్యాప్తంగా ఓటింగ్​​ ప్రారంభం కావడానికి ముందే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అక్కడక్కడ ఘర్షణలు..

బంగాల్​ ముర్షీదాబాద్​ బాలిగ్రామ్ పోలింగ్​ బూత్​లో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ కార్యకర్తలు గొడవపడ్డారు. ఓటేయటానికి క్యూలైన్లో ఉన్న ఓ వ్యక్తి మరణించారు.

దక్షిణ్​ దినాజ్​పూర్ జిల్లా బునియద్​పూర్​లో ఓ పోలింగ్​ ఏజెంట్​ తన ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉన్నారు. ముర్షీదాబాద్​ రాణిగంజ్​ ప్రాంతంలో రెండు పోలింగ్​ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి బాంబు విసిరాడు.

కేరళలో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. మరో వ్యక్తి ఓటు వేసి ఇంటికి చేరుకున్న తర్వాత కన్నుమూశాడు.

ఓటేసిన ప్రముఖులు...

ఈ విడతలో ప్రముఖ నేతలు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షా గుజరాత్​లో ఓటేశారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ నేతలు శశిథరూర్​, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మలయాళ ప్రముఖ నటులు మోహన్​ లాల్​, మమ్ముట్టిలు ఓటేశారు. క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​​ కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 23 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0142: Philippines Earthquake AP Clients Only 4207291
Quake survivor pulled from destroyed building
AP-APTN-0042: Spain Debate No Access Spain 4207287
Election TV debate with Spain's PM and candidates
AP-APTN-0027: US CA Sri Lankan Reaction AP Clients Only 4207286
After bombings US Sri Lankan immigrants react
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Apr 23, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.