ETV Bharat / bharat

ఉగ్రవాదం ఒక క్యాన్సర్: విదేశాంగ మంత్రి

author img

By

Published : Aug 28, 2020, 1:31 PM IST

Jaishankar
'తీవ్రవాదం ఒక క్యాన్సర్​.. మహమ్మారిలా విరుచుకుపడుతుంది'

ఉగ్రవాదం అనే క్యాన్సర్​.. మహమ్మారిలా ప్రతిఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్​. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్​పై పరోక్ష విమర్శలు చేశారు.

ఉగ్రవాదం ఒక క్యాన్సర్​ అని పేర్కొన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్​. మానవాళిపై మహమ్మారి రోగం ఏవిధంగా విరుచుకుపడుతుందో.. అదే విధంగా తీవ్రవాదం అనే క్యాన్సర్ ప్రతిఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

ద ఎనర్జీ అండ్​ రీసోర్సెస్​ ఇన్​స్టిట్యూట్​ (టీఈఆర్​ఐ)లో ప్రసంగించిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యనించారు జైశంకర్​.

" ఏదైనా సంఘటన జరిగి నష్టం వాటిల్లిన తర్వాత మాత్రమే ఉగ్రవాదం, మహమ్మారులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఉగ్రవాదులను తయారు చేసే దేశాలు కూడా (పాక్​ను ఉద్దేశిస్తూ) తమను తాము ఉగ్రవాద బాధితులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం, ఆ పోరుకు సాయం చేయటం, ప్రోత్సహించటం.. ఉవ్రవాద నిర్మూలనలో పురోగతిని సూచిస్తుంది."

- జైశంకర్​, విదేశాంగ శాఖ మంత్రి.

ఉగ్రవాదానికి తోడ్పడే దారులను మూసివేసేందుకు అంతర్జాతీయ వ్యవస్థలు.. అవసరమైన యంత్రాంగాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి.

ఇదీ చూడండి: ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం.. సన్నద్ధత ఏది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.