ETV Bharat / bharat

డిసెంబర్​ 4నుంచి యూకేకు నిరంతర విమాన సర్వీసులు

author img

By

Published : Oct 5, 2020, 5:36 PM IST

భారత్​ నుంచి బ్రిటన్​కు త్వరలోనే నిరంతర సర్వీసులను నడపనున్నట్లు దేశీయ విమాన సంస్థ స్పైస్​జెట్​ వెల్లడించింది. త్వరలోనే సుదూర ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తామని ఆ సంస్థ ఎండీ అజయ్​సింగ్​ తెలిపారు.

SpiceJet to start flights from India to London from Dec 4
డిసెంబర్​ 4నుంచి భారత్​ - బ్రిటన్ నాన్​స్టాప్​ ఫ్లైట్స్​

దిల్లీ, ముంబయి నుంచి లండన్​(యూకే)కు డిసెంబర్​ 4 నుంచి నిరంతర విమాన సౌకర్యం కల్పించనున్నట్టు భారత విమానయాన సంస్థ స్పైస్​జెట్​ ప్రకటించింది. ఈ మేరకు బ్రిటన్​కు తక్కువ ధరకే ఈ సేవలు అందిస్తామన్న స్పైస్​జెట్​.. దేశంలో ఈ ఘనత తమకే దక్కుతుందని తెలిపింది.

కొవిడ్​ నిబంధనల నేపథ్యంలో లండన్​తో కుదుర్చుకున్న ఒప్పందం(ఎయిర్​బబుల్​) ప్రకారం.. ఈ సేవలు కొనసాగించనున్నట్టు పేర్కొంది స్పైస్​జెట్​. అందులో భాగంగా 'ఎయిర్​బస్​ ఏ330-900 నియో' విమానాలను వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఫ్లైట్​లో... 353 ఎకానమీ, 18 బిజినెస్​(విలాసవంతమైన) తరగతుల సీట్లు ఉంటాయి.

దిల్లీ-లండన్​కు వారానికి రెండుసార్లు, ముంబయి-లండన్​కు వారంలో ఒకసారి ఈ విమానసేవలు అందుబాటులో ఉంటాయాని స్పైస్​జెట్​ ఎండీ అజయ్​సింగ్​ తెలిపారు. త్వరలోనే భారత్​ నుంచి సుదూర ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తామని చెప్పారు అజయ్​.

ఇదీ చదవండి: శివాంగి.. రఫేల్​ నడిపే 'శివంగి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.