ETV Bharat / bharat

మోదీ నా కుమారుడితో సమానం: షాహీన్​బాగ్ ఉద్యమకారిణి

author img

By

Published : Sep 25, 2020, 11:17 AM IST

ప్రపంచంలో 100 మంది ప్రభావశీలుర జాబితాలో తనకు స్థానం దక్కటంపై ఆనందంగా ఉందన్నారు షాహీన్​బాగ్​ ఉద్యమకారిణి బిల్కిస్ దాదీ. ప్రధాని నరేంద్రమోదీ తనకు కుమారుడి లాంటి వారని పేర్కొన్నారు.

bilkis
బిల్కిస్

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 'ప్రపంచంలోని 100 మంది ప్రభావశీలుర జాబితా'లో చోటుదక్కడంపై షాహీన్​బాగ్​ నిరసనకారిణి బిల్కిస్ దాదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన 82 ఏళ్ల ఉద్యమకారిణి.. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యతిరేక పోరుపై దృష్టి సారించాల్సిన సమయమని అన్నారు.

బిల్కిస్​ దాదీతో ముఖాముఖి

షాహీన్​బాగ్ నిరసనలతో..

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది దిల్లీలో జరిగిన షాహీన్​బాగ్​ నిరసనల నేపథ్యంలో బిల్కిస్​ వెలుగులోకి వచ్చారు. హాపుర్​కు చెందిన బిల్కిస్​.. తన కుమారులతో షాహీన్​బాగ్​లో నివసిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు-2020 జాబితాలో ఒకరిగా ఆమెను గుర్తించింది టైమ్​ మ్యాగజైన్​.

ఈ జాబితాలో చోటు సంపాదించిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు బిల్కిస్​. ఆయన పేరును చేర్చినందుకు టైమ్​ సంస్థకూ కృతజ్ఞత తెలిపారు. మోదీ తనకు కొడుకు లాంటి వారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అంబులెన్స్​లో కరోనా రోగి- వైన్​ షాప్​లో సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.