ETV Bharat / bharat

'దిశ' కేసు దోషులకు శిక్షపై జయ అలా... హేమ ఇలా...

author img

By

Published : Dec 3, 2019, 2:49 PM IST

Updated : Dec 3, 2019, 5:55 PM IST

హైదరాబాద్​లో పశువైద్యురాలి హత్యాచారం ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భాజపా ఎంపీ హేమా మాలిని. నిందితుల్ని శాశ్వతంగా జైలులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. "దోషులను బహిరంగంగా ఉరి తీయాలి" అని ఎస్పీ ఎంపీ జయా బచ్చన్​ అన్న మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేశారు హేమ.

Rapists should be kept in jail permanently says bjp mp Hema Malini
'దిశ' కేసు దోషులకు శిక్షపై జయ అలా... హేమ ఇలా...

హైదరాబాద్​ పశువైద్యురాలి​ హత్యాచారంపై పార్లమెంట్​ సభ్యులు తమ గళం వినిపిస్తున్నారు. నిన్న సమాజ్​వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో ప్రసంగిస్తూ.. 'నిందితులను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఉరి తీయాలి' అని అన్నారు.​ తాజాగా భాజపా ఎంపీ హేమా మాలిని ఈ కేసులోని నిందితులను 'శాశ్వతంగా జైల్లో బంధించడమే సబబు' అని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు హేమ.

'దిశ' కేసు దోషులకు శిక్షపై జయ అలా... హేమ ఇలా...

"ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. జైలు నుంచి ఆ నిందితులు ఎన్నటికీ బయటకు రాకుండా నిర్ణయం తీసుకోవాలి. అలాంటి వాళ్లు సమాజంలో తిరగకూడదు. ఎందుకంటే.. వారిది అసుర బుద్ధి. బయటకు వస్తే మళ్లీ మళ్లీ అలాంటి పనే చేస్తారు. పక్కవారిని కూడా ప్రోత్సహిస్తారు. వాళ్లను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు."

- హేమా మాలిని, భాజపా ఎంపీ

ఇదీ చదవండి:లారీలో చిక్కుకున్న 8 అడుగుల భారీ కొండచిలువ!

New Delhi, Dec 03 (ANI): Aam Aadmi Party (AAP) MPs Sanjay Singh and Sushil Gupta hold protest in Parliament premises in front of Mahatma Gandhi's statue on Dec 03. The protested against rise in onion prices. MP Sanjay Singh said, "32000 ton onions rotted away, why Centre didn't take action? You can let onions rot away but cannot sell it at lower prices?"

Last Updated : Dec 3, 2019, 5:55 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.