ETV Bharat / bharat

మే 31 వరకు లాక్​డౌన్ పొడిగింపు..

author img

By

Published : May 16, 2020, 11:33 PM IST

Updated : May 16, 2020, 11:38 PM IST

పంజాబ్​లో లాక్​డౌన్​ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. కర్ఫ్యూ మాత్రం ఎత్తివేయనున్నట్లు చెప్పారు. లాక్​డౌన్ 4.0పై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేశాక ఆంక్షల సడలింపుపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు.

Punjab extends lockdown till May 31
మే 31వరకు లాక్​డౌన్ పొడిగించిన పంజాబ్​

పంజాబ్​లో లాక్​డౌన్​​ మే 31 వరకు కొనసాగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. లాక్​డౌన్ 4.0పై కేంద్రం అధికారిక ప్రకటన జారీ చేయాడానికి ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్​లో కర్ఫ్యూ మాత్రం ఎత్తివేయనున్నట్లు స్పష్టం చేశారు. నాన్​ కంటైన్​మెంట్​ జోన్లలో మరిన్ని ఆంక్షలను సడలించనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు సింగ్​. పరిమిత సంఖ్యలో ప్రజా రవాణా పునురుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.

లాక్​డౌన్ 4.0కు సంబంధించి కేంద్రం ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం.. ఆంక్షల సడలింపుపై మరింత స్పష్టత ఇస్తామని అమరీందర్​ సింగ్ అన్నారు. పేస్​బుక్​ ఇంటరాక్షన్​లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు. చాలా నిబంధనలు ఎత్తివేస్తామని, కరోనా కట్టడికి ప్రజలు మరింత సహకరించాలని కోరారు. విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోవని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచవన్నారు.

జోన్ల విభజన అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాని కేంద్రానికి సూచించినట్లు పేర్కొన్నారు సింగ్. జిల్లా మొత్తం ఒకే జోన్​గా కాకుండా ఉండాలన్నారు. అలా అయితే కంటైన్​మెంట్ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించే వీలుంటుందని అన్నారు. పంజాబ్​లో కరోనా కేసుల రెట్టింపు సమయం 44 రోజులుగా ఉందని, వైరస్​ కట్టడికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated :May 16, 2020, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.