ETV Bharat / bharat

'గల్వాన్​ లోయ భారత్​దే.. చరిత్రే సాక్ష్యం'

author img

By

Published : Jun 20, 2020, 7:25 PM IST

Updated : Jun 20, 2020, 7:33 PM IST

గల్వాన్​ లోయ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ప్రాంతం భారత్​కే చెందిందని చరిత్ర ఎప్పుడో స్పష్టం చేసిందని పేర్కొంది. ఎల్​ఏసీపై భారత జవాన్లకు పూర్తి అవగాహన ఉందని.. చైనా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.

galwan
'గల్వాన్​ లోయ భారత్​దే.. చరిత్రే సాక్ష్యం'

గల్వాన్​ లోయ భారత భూభాగంలోనిదేనని​ పునరుద్ఘాటించింది విదేశాంగ శాఖ. ఈ విషయంపై చారిత్రకంగా ఎంతో స్పష్టత ఉందని గుర్తుచేసింది. ఈ ప్రాంతంపై తమకే హక్కులున్నాయన్న చైనా వాదన సరైనది కాదని తేల్చిచెప్పింది. గల్వాన్​ లోయపై చైనా గతంలో ప్రదర్శించిన వైఖరికి తాజా పరిణామాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో సోమవారం భారత్​-చైనా సైనికులు మధ్య భీకర ఘర్షణ జరిగింది. చైనా దుస్సాహసానికి 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలోనే గల్వాన్​ లోయ తమదేనని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.

భారత జవాన్ల వల్లే ఘర్షణ తలెత్తిందన్న చైనా ఆరోపణలపైనా విదేశాంగ శాఖ స్పందించింది. వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ)పై భారత జవాన్లకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది. అన్ని నిబంధనలకు సైన్యం కట్టుబడి ఉందని పేర్కొంది. ఎల్​ఏసీ దాటి సైన్యం ఎప్పుడూ కార్యకలాపాలు సాగించలేదని.. ఏం చేసినా వాస్తవాధీన రేఖ పరిధిలోనే చేసిందని తెలిపింది. భారత్​ సమకూర్చుకున్న మౌలిక వసతులన్నీ ఎల్​ఏసీ లోపలే ఉన్నాయని వెల్లడించింది.

మే 2020 నుంచి భారత సైనికులపై చైనా కయ్యానికి కాలుదువ్వుతోందని.. ఫలితంగానే గల్వాన్​ లోయలో హింస చెలరేగిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఏకపక్ష ధోరణితో పరిస్థితులను భారత్​ మార్చడానికి చూసిందన్న చైనా వాదనల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది.

Last Updated : Jun 20, 2020, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.