ETV Bharat / bharat

తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు: మోదీ

author img

By

Published : Jul 1, 2020, 10:37 AM IST

వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరులో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారని కొనియాడారు. ఇవాళ ఛార్టర్డ్​ ​ అకౌంటెంట్​ల డే కావటం వల్ల వారికీ శుభాకాంక్షలు చెప్పారు.

PM Modi
మోదీ

కరోనా మహమ్మారిపై పోరులో ముందువరుసలో నిలిచి సంకల్ప బలంతో పోరాడుతున్న వైద్యుల సేవలు నిరుపమానమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

"మన వైద్యులకు భారత్ సెల్యూట్ చేస్తోంది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారంటూ ఇటీవల ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జులై 1న డాక్టర్ బీసీ రాయ్ జయంతిని పురస్కరించుకొని వైద్యుల దినోత్సవం పాటిస్తారు.

వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.

  • Birthday wishes to our energetic Vice President, @MVenkaiahNaidu Garu. May he lead a long and healthy life. Venkaiah Ji is admired across the political spectrum for his warm nature, intelligence and wit. He has also been exceptional as the Chair of the Rajya Sabha. @VPSecretariat

    — Narendra Modi (@narendramodi) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మా శక్తిమంతమైన ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి. ఆయన తెలివితేటలతో రాజకీయ వర్గానికి స్ఫూర్తిగా నిలిచారు. రాజ్యసభ చైర్మన్​ అసాధారణ పనితనం కనబరుస్తున్నారు."

- ప్రధాని నరేంద్రమోదీ

సీఏలకూ..

  • Our industrious CA community has a major role to play in ensuring a healthy and transparent economy. Their services to the nation are deeply valued. Greetings on Chartered Accountants Day. pic.twitter.com/HnJLKTheIf

    — Narendra Modi (@narendramodi) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చార్టెర్డ్​ అకౌంటెంట్‌ల డే కూడా ఇవాళే కావటం వల్ల దానిని పురస్కరించుకొని మరొక ట్వీట్ చేశారు మోదీ. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సీఏలది ప్రముఖ పాత్రగా పేర్కొన్నారు. ఈ మేరకు మరొక వీడియోను కూడా పోస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.