ETV Bharat / bharat

కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసుకు దావుద్​తో లింకేంటి?

author img

By

Published : Oct 15, 2020, 9:09 AM IST

NIA suspects D-Company links to Kerala gold smuggling case
కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసుకు డీ-కంపెనీతో లింకేంటి?

మాఫియాడాన్​ దావూద్​ ఇబ్రహీం గ్యాంగ్​కు.. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్​ స్మగ్లింగ్​ కేసుతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). ఈ మేరకు ప్రత్యేక కోర్టులో అదనపు కౌంటర్​ దాఖలు చేసింది.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ వ్యవహారంలో ఉగ్రవాద ప్రమేయంపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ఈ కేసులో మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కోర్టులో అదనపు కౌంటర్‌ దాఖలు చేసిన ఎన్​ఐఏ, నిందితుల బెయిల్‌ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం తెలిపింది.

కేసులో నిందితుడైన రమీజ్​.. టాంజానియాలో వజ్రాల వ్యాపారం చేసేందుకుగానూ గోల్డ్ మైనింగ్‌ లైసెన్స్‌ కోసం ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎన్​ఐఏ తెలిపింది. దావూద్ ఇబ్రహీం తన అనుచరుడి ద్వారా అక్కడే వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇందులో డీ గ్యాంగ్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొంది.

బంగారం అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందిందని తెలిపింది ఎన్​ఐఏ. ఈ కేసు దర్యాప్తు సాగాలంటే అదుపులోకి తీసుకున్న నిందితులందరికీ 180 రోజులపాటు కస్టడీ తప్పనిసరని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.