ETV Bharat / bharat

'ముజఫర్​పుర్ ఆశ్రమ' కేసులో ఓ దోషి మృతి

author img

By

Published : Dec 9, 2020, 10:40 AM IST

బిహార్​ ముజఫర్​పుర్​ ఆశ్రమ బాలికల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి తిహార్​​ జైలులో మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. 70 ఏళ్ల వయస్సు పైబడిందని, అతనిది సహజమరణమేనని జైలు అధికారులు తెలిపారు.

mujjafarpur_shelter home
'ముజఫర్​పుర్ ఆశ్రమ' కేసులో దోషి మృతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్​ ముజఫర్​పుర్​ ఆశ్రమ బాలికల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిహార్​ జైలులో ఉన్న రామనుజ్​ ఠాకుర్​ అనే వ్యక్తి డిసెంబర్​ 3న మూడో నంబర్​ జైలులో ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. అతని వయస్సు 70 దాటిందని, సహజ మరణమేనని జైలు అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని.. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.

ముజఫర్​పుర్​ ఆశ్రమ బాలికల కేసులో 21 మందికి శిక్ష ఖరారు చేసింది దిల్లీ కోర్టు. అందులో ప్రధాన దోషి బ్రిజేష్​ ఠాకుర్​. అతని మామ రామనుజ్​ ఠాకుర్​ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసులో దోషిగా తేలటం వల్ల తిహార్​​ జైలుకు 2019, ఫిబ్రవరి 23న తరలించారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడటం వంటి తీవ్ర నేరాల కింద రామనుజ్​ ఠాకుర్​కు శిక్ష పడింది. అతనికి 2020, ఫిబ్రవరి 11న జీవిత ఖైదు, అలాగే రూ.60 వేల జరిమానా విధించింది దిల్లీ కోర్టు.

సమస్తిపుర్​కు చెందిన రామనుజ్​ ఠాకుర్​.. ముజఫర్​పుర్​లో ఉంటూ బాలికల ఆశ్రమ బాధ్యతలు చూసుకుంటుండేవాడు. ఈ క్రమంలోనే నేరాలకు పాల్పడినట్లు తేలింది.

ఇదీ చూడండి: ముజఫర్​పుర్​ కేసు: బ్రజేష్​ఠాకుర్​ సహా 12 మందికి జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.