ETV Bharat / bharat

భారత్​, పాక్​ అణుయుద్ధంతో కలిగే నష్టాలివే..!

author img

By

Published : Oct 3, 2019, 7:53 AM IST

కశ్మీర్​ అంశంలో భారత్​, పాక్​ మధ్య యుద్ధం సంభవించే అవకాశాలు ఉన్నాయని పలువురు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అణుయుద్ధానికి అవకాశం ఉంటుందని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పలు సందర్భాల్లో హెచ్చరించారు. ఒకవేళ రెండు దేశాల మధ్య అణుయుద్ధం తలెత్తితే పర్యవసానాలు ఏమిటి?

అణుయుద్ధం

పుల్వామా ఉగ్రదాడి, కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి ఉపసంహరణ వంటి పరిణామాల తర్వాత భారత్​, పాకిస్థాన్​ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అధికరణ 370 రద్దుపై అక్కసును వెళ్లగక్కుతూ పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ యుద్ధ భాషణ చేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల యుద్ధం మొదలైతే అది అణుసంగ్రామానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

యుద్ధం వస్తే...

ఈ నేపథ్యంలో ఒకవేళ ఇరు దేశాల మధ్య అణు యుద్ధం సంభవిస్తే.. అన్న ప్రశ్నకు సమాధానం వెతికారు అమెరికాలోని రట్​గర్స్​ విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఈ వివరాలను జర్నల్​ సైన్స్​ అడ్వాన్సెస్​లో ప్రచురించారు.

"2025లో భారత్​, పాక్​ మధ్య యుద్ధం సంభవిస్తే.. సుమారు 10 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయానికి ఇరు దేశాల వద్ద 400 నుంచి 500 మధ్య అణ్వాయుధాలు ఉండే అవకాశముంది."

-అలాన్​ రోబాక్​, పరిశోధన విద్యార్థి

కలిగే నష్టాలు

ఈ అణ్వాయుధాల విస్ఫోటం వల్ల కలిగే పర్యవసానాలను తమ అధ్యయనంలో పొందుపరిచారు.

⦁ కొన్ని వారాల్లోనే సుమారు 16 నుంచి 36 మిలియన్​ టన్నుల పొగ ప్రపంచ వాతావరణాన్ని కప్పేస్తుంది. ఈ పొగ 10 ఏళ్లు దాటినా వాతావరణాన్ని వీడదు.
⦁ సూర్యుని నుంచి రేడియేషన్​ గ్రహించి గాలిని వేడెక్కిస్తుంది.
⦁ భూమిని చేరే సూర్యుని కాంతి 20-35 శాతం క్షీణిస్తుంది. ఫలితంగా 2-5 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
⦁ వర్షపాతం 15 నుంచి 30 శాతం క్షీణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 15-30 శాతం విస్తీర్ణంలో వృక్ష సంపద నశిస్తుంది.
⦁ సముద్రాల నుంచి ఆహారోత్పత్తి 5 నుంచి 15 శాతం తగ్గిపోతుంది.
⦁ రెండు దేశాల్లో చూస్తే 50 నుంచి 125 మిలియన్ల ప్రజలు మరణించే అవకాశం ఉంది. ప్రపంచంపై పడే ఈ యుద్ధ ప్రభావంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రపంచంలో 9 దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్​, పాక్​ మాత్రమే వేగంగా వీటి సంఖ్యను పెంచుకుంటున్నాయని రోబాక్​ పేర్కొన్నారు. కశ్మీర్​ విషయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితి ఏర్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వీటిని రెండు దేశాలు గుర్తించాలని సూచించారు.

పరిశోధకుల అంచనా ప్రకారం.. 2025 నాటికి ప్రపంచంలో అణ్వాయుధాలు 15 వేల టన్నుల సామర్థ్యానికి చేరుకుంటాయి.

ఇదీ చూడండి: పాక్​ ఆధారిత ఉగ్రసంస్థలతో భారత్​కు ముప్పు: అమెరికా

AP Video Delivery Log - 2000 GMT News
Wednesday, 2 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1959: US TX Slain Deputy Memorial AP Clients Only 4232905
Mourners remember Sikh Texas deputy killed on duty
AP-APTN-1945: US Trump Finland Briefing AP Clients Only 4232897
Finnish leader lectures Trump on democracy and EU
AP-APTN-1943: SAfrica UK Royals Business AP Clients Only 4232903
Harry and Meghan meet entrepreneurs in Jo'burg
AP-APTN-1937: US NY R Kelly AP Clients Only 4232902
R. Kelly denied bail in New York
AP-APTN-1926: Ireland Customs Vehicles AP Clients Only 4232900
Customs vehicles arrive at Ireland-NIreland border
AP-APTN-1923: Archive Boeing Airbus WTO AP Clients Only 4232898
WTO $7.5B in tariffs on EU goods for Airbus case
AP-APTN-1919: Morocco Journalist Protest AP Clients Only 4232896
Protesters demand release of Moroccan journalist
AP-APTN-1907: Portugal Hurricane UGC Must credit Joao Nicolau 4232895
Waves smash into devastated Azores port
AP-APTN-1902: UK NI Brexit DUP No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4232859
DUP hails Brexit plan as 'serious and sensible'
AP-APTN-1859: France Sentsov AP Clients Only 4232894
Ukraine film director addresses EU Council
AP-APTN-1853: US WI Dassey Briefing Part Must Credit Wisconsin Department of Justice; Part Must Credit Wisconsin Department of Corrections; Part Must Credit Thomas Pearce 4232893
‘Making a Murderer’ subject seeks pardon
AP-APTN-1851: US Microsoft AP Clients Only 4232892
Microsoft unveils folding tablet, phone
AP-APTN-1849: US CA Missile Test AP Clients Only 4232891
Unarmed missile launched in test from California
AP-APTN-1841: Germany Ukraine AP Clients Only 4232844
Germany welcomes new accords in Donbas peace
AP-APTN-1841: Ireland UK NI Brexit Fears AP Clients Only 4232840
Fears of increased tariffs for NIreland farmers
AP-APTN-1833: Russia Putin 2 No access Russia; No use by Eurovision 4232887
Putin on Greta, Saudi attack, election hacking joke
AP-APTN-1829: UK Corbyn AP Clients Only 4232843
UK opposition leader reacts to Brexit plan
AP-APTN-1822: Belgium EU Brexit Verhofstadt AP Clients Only 4232886
Verhofstadt: reax to UK Brexit plan 'not positive'
AP-APTN-1815: Portugal Hurricane 3 AP Clients Only 4232885
Azores residents on hurricane damage
AP-APTN-1804: Belgium EU Brexit AP Clients Only 4232884
EU Brexit negotiator: UK offer shows progress
AP-APTN-1800: US CT B17 Crash Aerials Must credit “BOSTON 25 NEWS”; No access Boston; No use US broadcast networks; No re-use, re-sale or archive 4232882
Aerials over CT crash show plane in pieces
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.