ETV Bharat / bharat

'కరోనా లాక్​డౌన్​ పేరుతో పేదలపై దాడి'

author img

By

Published : Sep 9, 2020, 5:52 PM IST

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శల దాడి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రధాని మోదీ తీసుకున్న లాక్​డౌన్​ నిర్ణయం.. వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిందని, అసంఘటిత రంగం దారుణంగా దెబ్బతిందని మండిపడ్డారు.

Lockdown not an attack on coronavirus, but on poor: Rahul Gandhi
లాక్​డౌన్​ కారణంగానే అసంఘటిత రంగం దెబ్బతింది

ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. ఎలాంటి సమాచారం లేకుండా కేంద్రం తీసుకున్న లాక్​డౌన్​ నిర్ణయం వల్లే అసంఘటిత రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు.

  • अचानक किया गया लॉकडाउन असंगठित वर्ग के लिए मृत्युदंड जैसा साबित हुआ।

    वादा था 21 दिन में कोरोना ख़त्म करने का, लेकिन ख़त्म किए करोड़ों रोज़गार और छोटे उद्योग।

    मोदी जी का जनविरोधी 'डिज़ास्टर प्लान' जानने के लिए ये वीडियो देखें। pic.twitter.com/VWJQ3xAqmG

    — Rahul Gandhi (@RahulGandhi) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

97లక్షల మంది కార్మికులపై..

లాక్​డౌన్.. కరోనాపై చేసిన దాడి కంటే పేదలపైనే అధిక ప్రభావం చూపిందని రాహుల్​ విమర్శించారు. దినసరి కూలీలు, వలస కార్మికులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. లాక్​డౌన్​ నిర్ణయం సుమారు 97 లక్షల మంది వలస కార్మికులను ఇంటి బాట పట్టించిందని ఆందోళన వ్యక్తంచేశారు. వలస కార్మికులందరికీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్​ చేశారు రాహుల్​.

ప్రభుత్వ వైఫల్యం వల్లే..

కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం పనితీరు సరిగా లేనందునే భారత్​లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు రాహుల్​.

ఇదీ చదవండి: జీడీపీ పతనానికి కారణం 'గబ్బర్​ సింగ్​ ట్యాక్స్': రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.