ETV Bharat / bharat

కరోనా విలయం- 'మహా'లో మరో 10వేల కేసులు

author img

By

Published : Oct 14, 2020, 9:16 PM IST

దేశంలో కొవిడ్​ కేసులు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 72.52 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 1.10 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. దేశవ్యాప్తంగా 63.14 లక్షలమంది వైరస్​ను జయించగా.. 8.26లక్షల యాక్టివ్​ కేసులున్నాయి. మహారాష్ట్రలో మరో 10వేలకుపైగా వైరస్​ కేసులు బయటపడ్డాయి.

Maharashtra's COVID-19 tally rises to 15,54,389 with   the addition of 10,552 cases
కరోనా విలయం- 'మహా'లో మరో 10వేలకుపైగా కేసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 10,552 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య 15లక్షల 54వేల 389కి పెరిగింది. మరో 158 మంది కరోనాకు బలవ్వగా.. మరణాల సంఖ్య 40,859కి ఎగబాకింది.

  • కేరళలో ఒక్కరోజులో 6,244 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 3లక్షల 8వేల140కి చేరింది. ఇప్పటివరకు 1,066 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో మరో 9,265 మందికి మహమ్మారి సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 7లక్షల 35వేల 371కి పెరిగింది. మరో 75 చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 10,198కి ఎగబాకింది.
  • తమిళనాడులో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 4,462 మంది కొవిడ్​ బారినపడ్డారు. కేసుల సంఖ్య 6లక్షల 70వేల 392కు చేరింది. మరో 52 మరణించారు. ఫలితంగా చనిపోయిన వారి సంఖ్య 10,423 వద్ద నిలిచింది.
  • పశ్చిమ్​బంగాలో మరో 3,677 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 5వేల 697కు ఎగబాకింది. కరోనాతో మరో 64 చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,808కి చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో 2,778 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 4లక్షల 44వేల 711కి పెరిగింది. మరో 41 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 6,507కు చేరింది.
  • రాజస్థాన్​లో మరో 2,021 వైరస్​ కేసులు గుర్తించారు అధికారులు. బాధితుల సంఖ్య 1లక్ష 65వేల 92కు పెరిగింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,694 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇదీ చదవండి: దేశంలో 9కోట్లు దాటిన కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.