ETV Bharat / bharat

'వలస' ప్రమాదం: రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

author img

By

Published : May 19, 2020, 8:22 AM IST

Updated : May 19, 2020, 10:07 AM IST

The Jammu & Kashmir government on Monday notified Jammu and Kashmir Grant of Domicile Certificate (Procedure) Rules, 2020, which specify the conditions and the process to obtain the documents required tor applying to jobs and avail other privileges restricted to residents.

4 migrant workers killed
ఘోర రోడ్డు ప్రమాదం

09:58 May 19

ఘోర రోడ్డు ప్రమాదం

వలసకూలీల రక్తంతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ఇవాళ రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు వలసకూలీలు మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్రాలో నలుగురు మృతి..

మహారాష్ట్ర యావత్మల్ జిల్లా కొల్వన్​ వద్ద ఉదయం 3.30 గంటల సమయంలో...  ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఓ డ్రైవర్ సహా నలుగురు వలసకూలీలు మృతిచెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

"బాధిత వలసకూలీలు సోలాపుర్​ నుంచి నాగ్​పుర్​ రైల్వేస్టేషన్​కు వెళ్తున్నారు. అక్కడి నుంచి శ్రామిక్ రైళ్లలో ఝార్ఖండ్​లోని తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకున్నారు. అయితే డ్రైవర్​ బస్సును నియంత్రించలేక ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది." 

                      - పోలీసులు

యూపీలో ముగ్గురు మృతి..

ఉత్తర్​ప్రదేశ్ మహోబా జిల్లాలో​ ఝాన్సీ-మీర్జాపుర్ హైవేపై వలసకూలీలు వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

"ఈ వలస కార్మికులంతా దిల్లీ నుంచి కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు. అయితే ఉత్తర్​ప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలోని హర్​పాల్​పుర్​ వద్ద ట్రక్కు ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు టైరు పేలిపోవడం వల్ల డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయాడు. దీనితో ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయింది. దీనితో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు." 

                                                                - మణిలాల్​ పాటిదార్, మహోబా ఎస్​పీ

08:16 May 19

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు వలసకూలీలు మృతి

మహారాష్ట్ర యావత్మల్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని నలుగురు వలసకూలీలు మృతి చెందారు. 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వలసకూలీలు బస్సులో సోలాపుర్ నుంచి ఝార్ఖండ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.

Last Updated : May 19, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.