ETV Bharat / bharat

లాక్​డౌన్​లో 1.5 ఎకరాల సరస్సును తవ్విన ప్రజలు

author img

By

Published : Jun 14, 2020, 12:13 PM IST

లాక్​డౌన్​లో ఏకంగా ఓ సరస్సునే తవ్వేశారు కర్ణాటక ధార్​వాడ్​ నగర ప్రజలు. నాలుగు ప్రాంతాలకు చెందిన వారందరూ ఏకమై 1.5 ఎకరాల భూమిలో సరస్సును తవ్వి... అందుకు అయిన ఖర్చు మొత్తాన్ని వారే భరించారు.

Lockdown Utilisation People Themself built a lakelet  amid the city
లాక్​డౌన్​లో 1.5 ఎకరాల చెరువును తవ్వించిన ప్రజలు

కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. లాక్​డౌన్​తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంత మంది ఇంట్లో ఖాళీగా గడుపుతుంటే.. మరికొందరు మాత్రం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కర్ణాటక ధార్​వాడ్​ నగరంలోని నాలుగు ప్రాంతాల ప్రజలు కూడా చెరువు రూపంలో లాక్​డౌన్​ను సద్వినియోగం చేసుకున్నారు. అదెలాగో చూద్దాం..

ధార్​వాడ్ నగరంలోని బసవేశ్వర బదావనే, శాకంబరి, గురుదేవ, నందిని లేఅవుట్​లో నివాసముంటున్న ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక సరస్సును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి 3 లక్షల రూపాయలను సిద్ధం చేసి సరస్సును తవ్వేశారు.

లాక్​డౌన్​లో 1.5 ఎకరాల చెరువును తవ్వించిన ప్రజలు

అధికారులు స్పందించని కారణంగా

ఈ సరస్సును తవ్వించాలని ప్రభుత్వాధికారులను ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేనందున.. చివరకు తమ సొంత ఖర్చుతోనే తవ్వేశారు ధార్​వాడ్​ ప్రజలు.

స్థలంపై వివాదం...

కొంత మంది వ్యాపారవేత్తలు చెరువును తవ్విన స్థలంలో తమ వ్యాపార కార్యక్రమాల కోసం ఓ భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. దీన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. 2002 నుంచి ఈ స్థలంపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.

చివరకు ఈ స్థలాన్ని వ్యాపార వేత్తల వశం కాకుండా చెరువును సృష్టించగలిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఫలితంగా ఈ సరస్సు కూడా వాన నీటితో నిండుతోంది. తాము తవ్విన సరస్సులో నీటిని చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:లైవ్ వీడియో: శ్రీనగర్​ హైవేపై బాంబు నిర్వీర్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.