ETV Bharat / bharat

'ఆధార్'​లా రైతులకు 'స్వాభిమాని ఫార్మర్'​ కార్డ్

author img

By

Published : Jan 8, 2021, 6:48 PM IST

Updated : Jan 8, 2021, 7:31 PM IST

Swabhimani Farmer Identity Card in karnataka
ఆధార్​ మాదిరిగానే రైతులకు 'స్వాభిమాని ఫార్మర్'​ కార్డ్

కర్ణాటక రైతులకు 'స్వాభిమాని ఫార్మర్' అనే గుర్తింపు కార్డు పంపిణీ చేసేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రుణాలు, ప్రభుత్వ పథకాల విషయంలో రైతులకు త్వరితగతిన లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్డు అందిస్తోంది.

ఆధార్​ కార్డు మాదిరిగానే రాష్ట్రంలోని రైతులకు 'స్వాభిమాని ఫార్మర్​' అనే విశిష్ట గుర్తింపు కార్డు ఇవ్వనుంది కర్ణాటక ప్రభుత్వం. రుణాలు, ప్రభుత్వ పథకాల విషయంలో రైతులకు త్వరితగతిన లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ శనివారం.. కొప్పాల్​ జిల్లా రైతులకు తొలిసారిగా ఈ కార్డులు అందించనున్నారు.

'స్వాభిమాని ఫార్మర్'​ కార్డు అంటే?

రైతుల వివరాలను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేసింది. దీనికి 'ఫ్రూట్స్​' అనే పేరు పెట్టింది. ఈ సాఫ్ట్​వేర్​లో వివరాలు నమోదు చేసుకున్న ప్రతీ రైతుకు ఆధార్​ మాదిరిగా ఓ ప్రత్యేకమైన నంబర్​ కలిగిన గుర్తింపు కార్డు ఇవ్వనుంది. 'స్వాభిమాని ఫార్మర్' ద్వారా ఈ నంబర్​ లభిస్తుంది.

Swabhimani Farmer Identity Card in karnataka
స్వాభిమాని ఫార్మర్​ కార్డు ఇవ్వనున్న ప్రభుత్వం

ఈ కార్డు నంబర్​ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ ప్రయోజనాల కోసం రైతులు ఫ్రూట్స్​ సాఫ్ట్​వేర్​ను మాత్రమే ఉపయోగించాలి. 2018 నుంచి రైతుల వివరాలను ఆ సాఫ్ట్​వేర్​లో నమోదు చేయడం ప్రారంభించింది ప్రభుత్వం.

ప్రూట్స్​ సాఫ్ట్​వేర్​లో రైతు ఆధార్​ కార్డు, ఎస్సీ/ఎస్టీ రైతుల కులం సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు, ఫొటో మొదలైనవి పొందుపరుస్తారు. రైతుకున్న భూమి వివరాలు మాత్రం రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని 'భూమి' సాఫ్ట్​వేర్​ ద్వారానే తెలుసుకునే అవకాశముంది.

ఇదీ చదవండి:డాల్ఫిన్​ను కిరాతకంగా కొట్టి చంపిన దుండగులు

Last Updated :Jan 8, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.