ETV Bharat / bharat

ఆర్మీ జవానుతో సహా ఇద్దరు బాలికల నిర్బంధం!

author img

By

Published : Sep 24, 2020, 4:42 PM IST

కశ్మీర్ శ్రీనగర్​ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ జవాను, ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారు కశ్మీర్​ నుంచి దిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

Jammu and Kashmir : Army soldier, two girls detained at Srinagar Airport
ఆర్మీ జవానుతో సహా ఇద్దరు బాలికల నిర్బంధం!

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ విమానాశ్రయంలో ఓ ఆర్మీ జవానుతో సహా ఇద్దరు బాలికలను నిర్బంధించారు పోలీసులు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

బిహార్​ 17వ రెజిమెంటుకు చెందిన జవాను రోషన్​ కుమార్​.. తీత్వాల్​ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలతో దిల్లీ వెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలికలతో జవానుకు ఉన్న సంబంధమేంటో ఇంకా తెలియరాలేదు.

స్థానిక బాలికలతో ఆర్మీ జవాను పట్టుబడటం 12 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబర్​ 12న అశోక్​ కుమార్ అనే జవాను కూడా కొంతమంది బాలికలతో కనిపించగా అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ​

ఆర్మీ నిబంధనల ప్రకారం.. సిబ్బంది సామాన్య ప్రజానీకంతో మమేకం అయ్యేందుకు అవకాశం లేదు. ఏమైనా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

2017లో వివాదాస్పద సైనిక అధికారి మేజర్​ లీతుల్​ గొగొయి.. స్థానికుల్లో భయం కలిగించేందుకు ఓ వ్యక్తిని జీపు ముందు కట్టి తిప్పారు. దీనిపై అప్పట్లో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం.. గొగొయిపై సైన్యం చర్యలు తీసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.