ETV Bharat / bharat

టాప్​-100 శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ, కౌర్​

author img

By

Published : Mar 6, 2020, 6:34 AM IST

టైమ్​ మ్యాగజైన్​.. ప్రపంచంలోని 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను వెల్లడించింది. ఇందులో భారత్​ నుంచి ఇందిరా గాంధీ, అమృత్​కౌర్​లకు చోటు దక్కింది.

Indira Gandhi, Amrit Kaur named by TIME among '100 Women of the Year'
టైమ్​ మ్యాగజైన్​ టాప్​-100 శక్తిమంతమైన మహిళల్లో ఇందిరాగాంధీ, కౌర్​

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధురాలు అమృత్​ కౌర్​లకు 'టైమ్​ మ్యాగజైన్​' తన వందమంది శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు కల్పించింది. 1947 ఏడాదికి గానూ కౌర్​ను 'వుమెన్​ ఆఫ్​ ది ఇయర్​'గా పేర్కొన్న టైమ్... 1976 ఏడాదికి ఇందిరా గాంధీని 'ఎంప్రెస్​ ఆఫ్​ ఇండియా'గా తన​ ప్రొఫైల్​లో వివరించింది.

ఆర్థిక అస్థిరత నుంచి గట్టెక్కించిన గొప్ప నేత..

భారతదేశ తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ. 1975న ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సరికి దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఒకానొక పరిస్థితుల్లో ఆమె ఎన్నిక చెల్లదని భావించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో... ఆర్థిక అస్థిరత కారణంగా దేశంలో 'అత్యవసర పరిస్థితి'ని ప్రకటించిన గొప్ప నాయకురాలని టైమ్ తన​ ప్రొఫైల్​లో తెలిపింది.

మలేరియా నివారణలో కౌర్​ కృషి..

కపుర్తలా రాజ కుటుంబంలో జన్మించిన అమృత్​ కౌర్​ గురించి ప్రస్తావిస్తూ... 1918 లో ఆక్స్​ఫర్డ్​ యూనివర్శిటీ నుంచి వచ్చాకా మహాత్మాగాంధీ బోధన పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారని తెలిపింది. ఆ తరవాత దేశంలో వలసలు, అణచివేతలు నుంచి విముక్తి కల్పించడమే తన జీవిత లక్ష్యంగా పనిచేసారని కొనియాడింది. స్వాతంత్ర్యం అనంతరం మొదటి ఆరోగ్య మంత్రిగా పనిచేసిన కౌర్​... మలేరియా నివారణ ప్రచార కార్యక్రమాలు చేపట్టి వేల మందిని రక్షించారని పేర్కొంది.

అంతేకాకుండా.. ఈ శతాబ్దపు అనేక ప్రముఖ మహిళా నాయకుల వివరాలను ఈ ప్రాజెక్ట్​ సేకరించింది. ఇందులో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్​ ఒబామా కూడా ఉన్నారు.

ఇదీ చదవండి: నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తాం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.