ETV Bharat / bharat

హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమే!

author img

By

Published : Jul 31, 2020, 9:18 AM IST

దేశవ్యాప్తంగా ఒకేసారి హెర్డ్ ఇమ్యూనిటీ సాధించలేమంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే, వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు సమయాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే అవకాశముందని స్పష్టం చేశారు.

herd-immunity-in-india-may-generate-only-in-pockets-can-be-short-lived-scientists
ఒక్కో చోట.. ఒక్కో విధంగా హెర్డ్ ఇమ్యూనిటీ!

భారత దేశంలో వేరు వేరు ప్రాంతాల్లోని వైవిధ్యమైన సామాజిక- ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. హెర్డ్ ఇమ్యూనిటీ దేశవ్యాప్తంగా ఒకేసారి కాక, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో సాధించే అవకాశముందమన్నారు వ్యాధినిరోధక శాస్త్ర నిపుణుడు రథ్. అయితే, ఈ హెర్డ్ ఇమ్యూనిటీ భారత్ వంటి దేశాల్లో దీర్ఘకాలికంగా ఉంటుందని చెప్పలేమన్నారు.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే..

జ‌నాభాలో ఎక్కువ మంది వైర‌స్‌ను త‌ట్టుకునే శ‌క్తిని క‌లిగి ఉండ‌టాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ'గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ శ‌క్తిని సాధించాలంటే జ‌నాభాలో క‌నీసం 60 శాతం మంది వైర‌స్ నుంచి కోలుకొని ఉండ‌ట‌మో లేదా వ్యాక్సిన్ ద్వారా శక్తి సాధించ‌డ‌మో జ‌ర‌గాలి. వారి రోగ నిరోధక శక్తి మిగిలిన వారికి పరోక్షంగా శక్తినిస్తుందని తెలిపారు కోల్​కతా సీఎస్ ఐఆర్-ఐఐసీబీ కి చెందిన వైరాలజిస్ట్ ఉపాసన రే.

యాంటిబాడీల జీవితకాలమెంతో?

రక్తంలోని ప్లాస్మా ఆంగ్ల Y ఆకారంలో, పొడవుగా ఉండే.. ప్రోటీన్లను విడుదల చేస్తుంది. వీటిని యాంటీబాడీలుగా పరిగణిస్తారు. ఈ యాంటీ బాడీలను ఉపయోంగిచుకుని రోగనిరోధక వ్యవస్థ పని చేస్తుంది. అయతే, ఇవి కొన్ని సార్లు స్వల్పకాలంలోనే అంతం అయ్యే అవకాశాలుంటాయి.

అయితే, దేశంలో ఇప్పటి వరకు ఎంత శాతం మంది కరోనా నుంచి కోలుకుని పూర్తి స్థాయి రోగనిరోధక శక్తిని సాధించారనేదానిపై స్పష్టత లేదనన్నారు రథ్. అత్యధిక జనాభా కలిగిన ముంబయి నగరంలో నిర్వహించిన సర్వేలో.. మురికివాడల్లో 57 శాతం, నగరాల్లో 16 శాతం మంది తమలో యాంటిబాడీలను వృద్ధి చేసుకున్నారు. అంటే, ఒక్క నగరంలోనే హెర్డ్ ఇమ్యూనిటీ వేరు వేరు శాతాల్లో నమోదైంది.

జన సాంద్రతను బట్టి వైరస్ వ్యాప్తి ఉంటుంది. దానికి తోడు ఒకచోటు నుంచి మరో చోటుకు జనం ప్రయాణిస్తూనే ఉంటారు. అంతే కాదు, వైరస్ ఎంత బలంగా ఉంటే రోగనిరోధక శక్తిని సాధించడం అంత కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో దేశమంతా ఒకేసారి హెర్డ్ ఇమ్యూనిటీని ఎప్పటికి సాధించగలదో అంచనావేయడం కష్టమంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి: 'హెర్డ్ ఇమ్యూనిటీ'పై స్పెయిన్ ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.