ETV Bharat / bharat

టిక్​టాక్ సరదాకు ఐదుగురు పిల్లల బలి

author img

By

Published : May 30, 2020, 9:40 AM IST

వారణాసిలో టిక్​టాక్​ సరదాకు ఐదుగురు పిల్లలు మృత్యువాత పడ్డారు. గంగానదిలో టిక్​ టాక్ చేసేందుకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు నీట మునిగి.. ఐదుగురు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో జరిగిందీ విషాద ఘటన.

Five boys drown while 'making TikTok video' in river Ganga
టిక్​ టాక్​ సరదాకు ఐదుగురు యువకులు బలి

టిక్‌టాక్ సరదా ఐదుగురు పిల్లల నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాద ఘటన వారణాసిలో జరిగింది. ప్రమాదవశాత్తు గంగా నదిలో మునిగిన బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఒకరి తరువాత ఒకరు నీట మునిగి ఐదుగురు చనిపోయారు. మృతులు 15 ఏళ్ల లోపు వారే కావడం వల్ల వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వారణాసికి చెందిన ఈ ఐదుగురు టిక్‌టాక్‌ వీడియోలు చేసేందుకు గంగా నది ఒడ్డుకు శుక్రవారం ఉదయం వెళ్లారు. ఒకరు నీటిలో మునిగి ఉంటే.. మరొకరు టిక్‌టాక్ వీడియో చేయాలనుకున్నారు. నదిలోతు గమనించని వారిలో ఒక బాలుడు ప్రమాదవశాత్తు నీటమునిగాడు. ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఒకరి తరువాత మరొకరు నదిలో దూకి ప్రాణాలు పొగొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి మృత దేహాలను బయటకు తీశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:చైనాతో సరిహద్దుల వద్ద దూకుడుగానే సైన్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.