ETV Bharat / bharat

'దేశవ్యాప్తంగా దిశ బిల్లు తెచ్చేవరకు దీక్ష విరమించను'

author img

By

Published : Dec 15, 2019, 6:00 AM IST

Updated : Dec 15, 2019, 7:05 AM IST

దిశ బిల్లును తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలని ప్రధాని మోదీని లేఖ ద్వారా కోరారు దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్​​. దేశవ్యాప్తంగా బిల్లును తీసుకొచ్చేవరకు తన నిరాహార దీక్ష విరమించేది లేదన్నారు. మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు.

DCW chief Swati Maliwal demands implementation of Disha Bill across nation
'దేశవ్యాప్తంగా దిశ బిల్లు తెచ్చేవరకు దీక్ష విరమించను'

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీ మహిళా కమిషన్‌ చైర్​పర్సన్​ స్వాతి మాలివాల్... ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఆంధ్రప్రదేశ్​ సర్కారు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి కేసులను 21 రోజుల్లోనే పరిష్కరించి దోషులకు జీవితఖైదు లేదా మరణదండన విధించనున్నారు.

దిశ బిల్లును తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలని ఆమె ప్రధాని మోదీని లేఖ ద్వారా కోరారు. మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ స్వాతి మాలివాల్ పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. డిసెంబర్​ 3న దీక్ష ప్రారంభించిన తర్వాత రెండోసారి ఆమె ప్రధానికి లేఖ రాయడం గమనార్హం.

ప్రమాదకరంగా ఆరోగ్యం

స్వాతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమీక్ష నిర్వహించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని తెలిపారు. రక్తంలో యూరిక్ ఆమ్లాలు ప్రమాదకర స్థాయికి చేరాయని వెల్లడించారు. ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించగా... అందుకు స్వాతి నిరాకరించారు. దీక్షను అలాగే కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: మరో 3 నెలలు గృహ నిర్బంధంలోనే ఫరూక్​

Patna (Bihar), Dec 14 (ANI): BJP MP Giriraj Singh on December 14 slammed Rahul Gandhi over his jibe on Veer Savarkar during rally in Delhi's Ramlila Maidan. He said that he cannot be Vinayak Damodar Savarkar. "Savarkar endured torture in cellular jail but in Nehru family nobody endured torture in cellular jail, putting Gandhi surname doesn't mean that you're Gandhi." Earlier in the day, Rahul Gandhi said that his name is Rahul Gandhi not Rahul Savarkar, hence he will not apologise for speaking truth. "I was told in Parliament by BJP yesterday 'Rahul, you gave a speech. Apologise for that.' I was told to apologise for something which is right. My name is not Rahul Savarkar. My name is Rahul Gandhi. I will never apologise for truth," said Rahul Gandhi.

Last Updated :Dec 15, 2019, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.