ETV Bharat / bharat

కరోనా హాట్​స్పాట్​గా కుగ్రామం.. వారంలో 200 కేసులు

author img

By

Published : Aug 1, 2020, 5:22 AM IST

దేశంలో తొలికేసు నమోదైన కేరళలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. వయనాడ్​ జిల్లా ధవింహాల్​ పంచాయతీ​ పరిధిలోని ఓ మారుమాల కుగ్రామం వైరస్​ హాట్​స్పాట్​గా మారింది. వారం రోజుల్లో 200 మందికి వైరస్​ సోకింది.

corona hotspot in kerala
కరోనా హాట్​స్పాట్​గా కుగ్రామం.

కేరళలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వయనాడ్​ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం వైరస్​ హాట్​స్పాట్​గా మారింది. తొలుత రెండు కుటుంబాల్లో 8 మందికి కరోనా సోకినట్లు తెలిన తర్వాత వారం రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇప్పటివరకు 199 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరించారు వైద్యులు.

థవింహాల్​ పంచాయతీ​ పరిధిలోని వలాద్​ వార్డ్​ గ్రామంలో గురువారం వరకు 169 కేసులు రాగా శుక్రవారం ఒక్కరోజే 30 మందికి వైరస్​ సోకింది. మొత్తం సంఖ్య 199కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యలు చెబుతున్నారు.

" సోమవారం నుంచి ఈ పంచాయతీని కంటేయిన్​మెంట్​ జోన్​గా ప్రకటించాం. మరింత మందికి వైరస్​ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటామనే నమ్మకం ఉంది."

- వైద్యాధికారులు

వయనాడ్​ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 310 పాజిటివ్​ కేసులు వచ్చాయి. 2,750 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఏడుగురితో మొదలు..

గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లోని ఏడుగురికి గత వారం కరోనా పాజిటివ్​గా తేలింది. ఒక కుటుంబంలోని వారు కొవిడ్​-19తో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరైన నేపథ్యంలో సోకగా.. మరో కుటుంబ సభ్యుడు ఓ వివాహానికి హాజరైన తర్వాత వారందరికి పాజిటివ్​గా తేలింది. గ్రామంలో వారం క్రితం 8 మందికి మాత్రమే వైరస్​ నిర్ధరణ అయింది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వారితో నేరుగా కలిసిన వారికి రాపిడ్​ యాంటిజెన్​ టెస్టులు చెపట్టారు. బుధవారానికి 83 పాజిటివ్​ కేసులు తేలాయి. వారితో నేరుగా కలిసిన వారు సుమారు 500 మంది వరకు.. సెంకడరీ కాంటాక్ట్​ 2వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరీక్షలు వేగవంతం చేశారు.

ఇదీ చూడండి: తాళ్లతో లాక్కెళ్లి కరోనా మృతుడి అంత్యక్రియలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.