ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొత్తగా 20 వేల మందికి కరోనా

author img

By

Published : Sep 8, 2020, 7:48 PM IST

Updated : Sep 8, 2020, 9:42 PM IST

దేశంలో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో దాదాపు 70 శాతం మరణాలు సంభవించాయని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో తాజాగా 20,131 మంది మహమ్మారి బారిన పడ్డారు.

Complaints from states that people becoming lax in taking COVID-19 precautions: Health ministry
ఆ ఐదు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా మరణాలు!

కరోనా నిబంధనలతో ప్రజలు విసిగెత్తి, వాటిని పట్టించుకోవటం లేదని.. అందువల్లే కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే.. మహమ్మారి నియంత్రణకు భౌతిక దూరం, మాస్క్​లు ధరించటం ఎంతో ముఖ్యమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్​​ స్పష్టంచేశారు.

దేశంలోని ప్రతి మిలియన్​ జనాభాలో 3,102 మంది కరోనా బారిన పడ్డారని.. ప్రపంచంతో పోల్చి చూస్తే చాలా తక్కువని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి భూషణ్ తెలిపారు. అలాగే 53 మంది మరణించారని.. ఈ విషయంలో ప్రపంచ సగటు 113గా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్టాల నుంచే దాదాపు 70 శాతం ఉన్నాయని తెలిపారు. ఆ రాష్ట్రాల్లోనే 62 శాతం యాక్టివ్​ కేసులు ఉన్నట్లు భూషణ్ వెల్లడించారు.

రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. తాజాగా మరో 20,131 మందికి పాజిటివ్​గా తేలగా.. 380 మంది మృతి చెందారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 9,43,772కు.. మరణాలు 27,407కు చేరాయి. ఒక్క పుణె జిల్లాలోనే ఇప్పటివరకు 2లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో 2లక్షల పాజిటివ్‌ కేసులు దాటిన తొలి జిల్లాగా రికార్డు సాధించింది.

  • కర్ణాటకలో మరో 7,866 మంది కరోనా బారిన పడగా.. 146 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 4,12,190 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది డిశ్చార్జ్ కాగా.. 96,918 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 6,743 మంది కరోనా బారిన పడ్డారు. వీరితో కలిపి బాధితుల సంఖ్య 2.78 లక్షలకు చేరింది. మరో 4,047 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో తాజాగా 5,684 కేసులు వెలుగుచూశాయి. మరో 87 మంది మరణించగా... 6,599 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,74,940 మంది వైరస్​ బారిన పడ్డారు. 8,012 మంది వైరస్​కు బలయ్యారు.
  • దిల్లీ రికార్డు స్థాయిలో 3,609 కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,618 మంది మృతి చెందగా.. 1,97,135కు కేసులు చేరాయి.
  • ఒడిశాలో కొత్తగా 3,490 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య 1,31,382కు చేరింది. 569 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి 1,89,956 కేసులు బయటపడ్డారు. ఫలితంగా 3,677 మంది మృతి చెందారు.
  • కేరళలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మరో 3,026 మందికి పాజిటివ్​ నిర్ధరణ కాగా.. 1,862 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,217 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • జమ్ముకశ్మీర్​లో కొత్తగా 1355 కరోనా కేసులను గుర్తించారు. వీటిలో 570 కశ్మీర్​లో, 785 జమ్ము ప్రాంతంలో వెలుగుచూశాయి.
  • పుదుచ్చేరిలో మరో 440 కేసులు బయటపడ్డాయి. 12 మంది మృతి చెందారు.
Last Updated : Sep 8, 2020, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.