ETV Bharat / bharat

కేరళలో రెండు చోట్ల కరోనా సామాజిక వ్యాప్తి

author img

By

Published : Jul 18, 2020, 12:01 PM IST

కేరళలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తిరువనంతపురం జిల్లాలోని రెండు తీర ప్రాంత గ్రామాల్లో సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11వేల మార్కును దాటింది.

Community transmission in two Kerala coastal
కేరళలో రెండు చోట్ల కరోనా సామాజిక వ్యాప్తి

దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో.. సామాజిక వ్యాప్తి వెలుగు చూసింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తిని గుర్తించినట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. తిరువనంతపురం జిల్లాలోని రెండు తీర ప్రాంత గ్రామాలు పూంతుర, పులువిలాల్లో సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 285 కరోనా హాట్​స్పాట్​లు ఉన్నట్లు తెలిపారు.

"తిరువనంతపురంలోని తీర ప్రాంతంలో కరోనా వేగంగా విస్తరించటం వల్ల గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు తలెత్తాయి. శనివారం నుంచి ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమలు చేస్తున్నాం. పుల్లువిలా గ్రామంలో 97 మందికి పరీక్షలు నిర్వహించగా 57 మందికి పాజిటివ్​గా తేలింది. పూంతురలో 50 నమూనాల్లో 26 పాజిటివ్​గా నిర్ధరణ అయ్యాయి. ఈ రెండు గ్రామాల్లో సామాజిక వ్యాప్తి ప్రారంభమైంది."

- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి.

తిరువనంతపురం జిల్లాలో మొత్తం 246 పాజిటివ్​ కేసుల్లో ఇద్దరు విదేశాల నుంచి వచ్చారని, 237 మందికి ఇతరుల ద్వారా సోకినట్లు చెప్పారు విజయన్​.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11,066కు చేరగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 34,884 కేసులు, 671 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.