ETV Bharat / bharat

'లాక్​డౌన్​ లేకపోతే ఈపాటికి 8 లక్షల కేసులు'

author img

By

Published : Apr 11, 2020, 4:36 PM IST

Updated : Apr 11, 2020, 9:04 PM IST

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.7లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 7,447 కేసులున్నట్టు వివరించింది. లాక్​డౌన్​ వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. లేకపోతే ఏప్రిల్ 15 నాటికి 8.2 లక్షలు దాటేదని స్పష్టం చేసింది.

central-health-ministry-briefing-on-corona-virus-outbreak-in-india
లాక్​డౌన్​ లేకపోతే.. ఈపాటికి 2లక్షల కేసులు'

ప్రాణాంతక కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఆరోగ్యశాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షకుపైగా ఐసోలేషన్​ బెడ్లు అందుబాటులో ఉన్నాయని.. కేవలం వైరస్​ రోగుల చికిత్స కోసేం 586 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు వివరించింది.

ఇప్పటివరకు మొత్తం 1.7లక్షల మందిని పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 16,500 కరోనా పరీక్షలు జరిగినట్టు వివరించారు. 24 గంటల్లో 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం మీద 7,447కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి 642 మంది బాధితులు కోలుకున్నారని వివరించారు.

విపత్కర పరిస్థితుల్లో లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడం ఎంతో ముఖ్యమన్నారు లవ్​ అగర్వాల్​. దేశం లాక్​డౌన్​లో ఉన్నందువల్లే కేసులు తక్కువగా ఉన్నాయని.. లేకపోతే ఏప్రిల్ 15 నాటికి 8.2లక్షలు దాటిపోయేవని అభిప్రాయపడ్డారు. లాక్​డౌన్​ పొడిగింపు విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- లాక్​డౌన్​ మరో 2 వారాలు పొడిగింపు?

Last Updated : Apr 11, 2020, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.