ETV Bharat / bharat

ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

author img

By

Published : Apr 22, 2020, 3:42 PM IST

దేశంలో ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​ను తీసుకొచ్చింది. రాష్ట్రపతి సంతకం అనంతరం అమల్లోకి రానున్న ఈ ఆర్డినెన్స్​ ప్రకారం.. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై ఎవరైనా దాడికి పాల్పడితే 6 నెలల నుంచి 7ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సిందే.

CENTER HAD BROUGHT AN ORDINANCE TO END VIOLENCE AGAINST HEALTH WORKERS
ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న వేళ.. ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేక ఆర్డినెన్సును తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎవరైనా దోషులుగా తేలితే.. వారికి 6 నెలల నుంచి 7ఏళ్ల పాటు జైలు శిక్ష విధించనుంది. రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసింది కేంద్రం. రాష్ట్రప్రతి సంతకం తర్వాత ఈ ఆర్డినెన్స్​ అమల్లోకి రానుంది.

ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు దురదృష్టకరమన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​. వారిపై ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్యులపై దాడికి సంబంధించన ఘటనలు నాన్​ బెయిలెబుల్​ కేసులుగా పరిగణించనున్నట్టు పేర్కొన్నారు.

కరోనా విధుల్లో ఉన్న అన్ని రకాల ఆరోగ్య సిబ్బందికి రూ.50లక్షల వరకు వైద్య బీమా ఉంటుందని జావడేకర్​ తెలిపారు. అలాగే బాధితులకు ఆయుష్మాన్​ పథకం కింద చికిత్స అందించనున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:- ఆరోగ్య రంగానికి కరోనా నేర్పిన పాఠాలివే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.