ETV Bharat / bharat

'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్​'

author img

By

Published : Aug 17, 2020, 8:58 AM IST

కరోనా మహమ్మారికి సహజసిద్ధమైన వైద్యముందని చెప్పారు రాజస్థాన్ భాజపా ఎంపీ సుఖ్​బీర్ సింగ్​. బురదలో కూర్చొని శంఖం ఊదితే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు.

BJP MP sukhbeer singh statement If you blow a conch sitting in the mud corona will away
'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్​'

కరోనా వైరస్ ధాటికి ప్రజలంతా బెంబేలెత్తి పోతున్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కోసం వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కరోనాకు ఎవరూ భయపడవద్దని చెబుతున్నారు రాజస్థాన్​ టోంక్​ సవాయి మధోంపుర్ ఎంపీ సుఖ్​బీర్ ​ సింగ్. తన వద్ద ప్రకృతి సిద్ధమైన వైద్యం ఉందని తెలిపారు. బురదలో కూర్చొని శంఖాన్ని పూరిస్తే కరోనా వైరస్​ పరార్ అవుతుందని చెప్పారు. దీని కోసం ఓ వీడియోను విడుదల చేశారు.

'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్​'

ఇలా చేస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందాన్నారు సుఖ్​బీర్​ సింగ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.