ETV Bharat / bharat

భారత సైనికుల కోసం భద్రమైన మెసేజింగ్ యాప్

author img

By

Published : Oct 30, 2020, 5:36 AM IST

ఆర్మీలో సమాచార గోప్యత కోసం నడుం బిగించింది భారత సైన్యం. పటిష్ఠ భద్రత కలిగిన ఓ ప్రత్యేక మెసేజింగ్​ యాప్​ను ఆవిష్కరించింది. మౌలిక వసతుల అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేందుకు ఓ సాఫ్ట్​వేర్​ను తీసుకువచ్చింది.

Army launches software for infrastructure management and messaging app
ప్రత్యేక మెసేజింగ్​ యాప్​ను తీసుకువచ్చిన ఆర్మీ

రక్షణ రంగంలో సమాచార భద్రత కోసం భారత ఆర్మీ కీలక చర్యలు తీసుకుంది. 'సాయ్(సెక్యూరిటీ అప్లికేషన్​ ఫర్​ ఇంటర్​నెట్​)'​ పేరుతో ఓ మెసేజింగ్​ యాప్​ను భారత ఆర్మీ.. గురువారం ఆవిష్కరించింది. సైనికుల ఫోన్​కాల్స్​, సందేశాలు, వీడియో కాల్స్​ వంటి వాటికి రక్షణ కల్పించేలా ఈ యాప్​ను రూపొందించారు.

"సాయ్​ కూడా వాట్సాప్​, టెలిగ్రామ్​, సంవాద్​, జిమ్స్​ లాగానే పని చేస్తుంది. దీనిలో ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​​ సదుపాయం ఉంటుంది. ఆర్మీలో సేవలందించే వాళ్లందరూ ఈ యాప్​ను ఉపయోగించేలా రూపొందించాం. ఆండ్రాయిడ్​ వేదికగా ఇది పని చేస్తుంది."

--భారత సైన్యం.

ఆర్మీ సైబర్​ గ్రూప్​, సీఈఆర్​టీ(కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం) సంస్థ కలసి ఈ యాప్​ను అభివృద్ధి చేశాయి.

పనుల్లో పారదర్శకత కోసం..

'ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​' పేరుతో ఓ సాఫ్ట్​వేర్​ను ఆవిష్కరించారు సైనికాధికారులు. మౌలిక వసతుల అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేందుకే దీన్ని తీసుకువచ్చామని తెలిపారు.

"మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఇటీవల చర్యలు చేపట్టాం. ఇందుకోసం కావాల్సిన భూమి, తదితర ప్రణాళికలను పర్యవేక్షించేందుకు ఈ సాఫ్ట్​వేర్​ ఉపకరిస్తుంది. దీని​ సాయంతో పారదర్శకంగా, జవాబుదారీతనంగా పనులు జరుగుతాయి."

--భారత సైన్యం.

ఈ సాఫ్ట్​వేర్​ను భారత ఆర్మీ ఛీఫ్ జనరల్​​ మనోజ్​ ముకుంద్​ నరవణే ప్రారంభించారు.

ఇదీ చూడండి: 'పాక్​ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.