ETV Bharat / bharat

సైన్యాధికారుల మధ్య అభిప్రాయభేదాలు- రంగంలోకి నరవాణే

author img

By

Published : Sep 21, 2020, 4:35 PM IST

సైన్యంలోని సౌత్​ వెస్ట్రన్ కమాండ్​లో కమాండర్​​, ఆయన చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు సైన్యాధినేత జనరల్​ ఎంఎం నరవాణే. ఇందుకోసం ఓ సీనియర్​ లెఫ్టినెంట్​ జనరల్​ను నియమించారు.

Army Chief
నైరుతి కమాండ్​లో భేదాభిప్రాయాల పరిష్కారానికి చర్యలు!

సైన్యంలోని సౌత్​ వెస్ట్రన్​ కమాండ్​లో అధికారుల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించేందుకు ఓ సీనియర్​ లెఫ్టినెంట్​ జనరల్​ను నియమించారు సైన్యాధినేత జనరల్​ ఎంఎం నరవాణే. కమాండ్​ ప్రధాన కార్యాలయంలోని వివిధ నియామకాల పాత్ర, చార్టర్​, విధులపై ఆర్మీ కమాండర్​, అతని చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ మధ్య కొద్ది రోజులుగా నెలకొన్న భేదాభిప్రాయాలను పరిశీలించి, పరిష్కరించనున్నారు.

ఈ మేరకు కమాండ్​ ప్రధాన కార్యాలయం పనితీరును క్రమబద్ధీకరించేందుకు పరిష్కార మార్గాలు సహా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు లెఫ్టినెంట్​ జనరల్​.

సౌత్​ వెస్ట్రన్​ కమాండ్​ ప్రధాన కార్యాలయంలోని ఇబ్బందులు, రోజువారీ పనులకు ఆటంకం కలగటంపై కమాండర్​తోపాటు ఆయన చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ మేరకు చర్యలు చేపట్టారు సీఓఏఎస్​ నరవాణే.

రాజస్థాన్​లోని జైపుర్​లో సౌత్​ వెస్ట్రన్​ ఆర్మీ కమాండ్​ ప్రధానకార్యాలయం ఉంది. రాజస్థాన్​ నుంచి పంజాబ్​లోని కొన్ని ప్రాంతాల వరకు పాకిస్థాన్​ సరిహద్దులను చూస్తోంది.

ఇదీ చూడండి:కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష పోస్టులు ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.