ETV Bharat / bharat

మతాంతర వివాహం తప్పేమీ కాదు: హైకోర్టు

author img

By

Published : Dec 29, 2020, 1:13 PM IST

మతంతో సంబంధం లేకుండా ఒక మహిళ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని అలహాబాద్​ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మతాంతర వివాహం చేసుకున్న జంటకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

'Right To Live On Her Terms': Allahabad HC reunites interfaith couple
మతాంతర వివాహం తప్పేమీ కాదు: అలహాబాద్​ హైకోర్టు

మతం పేరిట ఒక జంటను విడదీయలేరని అలహాబాద్​ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

తన కుమార్తెను ఎత్తుకెళ్లి, బలవంతంగా మతాంతర వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​కు చెందిన ఒక వ్యక్తి(యువతి తండ్రి) కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్​ పంకజ్​ నక్వీ, జస్టిస్ వివేక్​ అగర్వాల్​తో కూడిన ధర్మాసనం వయోజనురాలైన యువతికి తన జీవత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని ఉద్ఘాటించింది. యువతి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆమె భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టేసింది.

ఇదీ చదవండి: 'మత స్వేచ్ఛ' బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.