ETV Bharat / bharat

దేశంలో రోజుకు సగటున 87 అత్యాచారాలు

author img

By

Published : Sep 30, 2020, 12:06 PM IST

భారత్​లో 2019లో రోజుకు సగటున 87 అత్యాచార ఘటనలు జరిగాయని జాతీయ నేర నమోదు విభాగం నివేదించింది. 2018తో పోలిస్తే గతేడాది మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయని తెలిపింది. ఈ జాబితాలో ఉత్తర్​ప్రదేశ్​ మొదటిస్థానంలో ఉంది.

దేశంలో రోజుకు సగటున 87 అత్యాచారాలు భారత్​లో 2019 సంవత్సరంలో రోజుకు సగటున 87 అత్యాచార ఘటనలు జరిగాయని జాతీయ నేర నమోదు సంస్థ నివేదించింది. 2018తో పోలిస్తే గతేడాది మహిళలపై నేరాల్లో 7.3 శాతం పెరుగుదల నమోదైంది. ఈ జాబితాలో ఉత్తర్​ప్రదేశ్​ మొదటిస్థానంలో ఉంది.  దేశంలో మహిళలపై నేరాలు 2019లో భారీగా పెరిగాయి. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్​సీఆర్​బీ) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మహిళలపై నేరాల్లో 2019లో 7.3 శాతం పెరుగుదల నమోదైంది. రోజుకు సగటున 87 అత్యాచారాలు జరిగినట్లు నివేదించింది.  2018లో ఈ సంఖ్య 3.78 లక్షలుగా ఉండగా.. గతేడాది 4.05 లక్షలకు చేరినట్లు 'క్రైమ్స్ ఇన్ ఇండియా-2019' నివేదిక స్పష్టం చేసింది. ఇందులో అధిక శాతం (30.9శాతం) గృహ హింసకు సంబంధించినవేనని తెలిపింది.  ఆ తర్వాతి స్థానాల్లో  ఉద్దేశపూర్వక దాడులు- 21.84 శాతం అపరహరణలు- 17.9 శాతం అత్యాచారాలు- 7.9 శాతం నివేదికలోని మరిన్ని అంశాలు.. ప్రతి లక్షమంది మహిళ జనాభాలో నేరాల రేటు 2019లో 62.4 శాతంగా ఉంది. 2018లో ఇది 58.8 శాతం.  మహిళలపై నేరాల్లో దేశంలో ఉత్తర్​ప్రదేశ్ (59,583 )​ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రాజస్థాన్ (47,550), మహారాష్ట్ర (37,144) ఉన్నాయి.  బాలికలపై నేరాల్లోనూ ఉత్తర్​ప్రదేశ్ (7,444)​ మొదటిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (6,402), మధ్యప్రదేశ్​ (6,053) ఉన్నాయి.  అత్యాచారాల్లో 5,997 కేసులతో రాజస్థాన్​ ముందుండగా.. ఉత్తర్​ప్రదేశ్​ (3,065), మధ్యప్రదేశ్ (2,485) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
మహిళలపై నేరాలు

దేశంలో మహిళలపై నేరాలు 2019లో భారీగా పెరిగాయి. జాతీయ నేర నమోదు విభాగం (ఎన్​సీఆర్​బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మహిళలపై నేరాల్లో 2019లో 7.3 శాతం పెరుగుదల నమోదైంది. రోజుకు సగటున 87 అత్యాచారాలు జరిగాయి.

2018లో ఈ సంఖ్య 3.78 లక్షలుగా ఉండగా.. గతేడాది 4.05 లక్షలకు చేరినట్లు 'క్రైమ్స్ ఇన్ ఇండియా-2019' నివేదిక స్పష్టం చేసింది. ఇందులో అధిక శాతం (30.9శాతం) గృహ హింసకు సంబంధించినవేనని తెలిపింది.

ఆ తర్వాతి స్థానాల్లో

  • ఉద్దేశపూర్వక దాడులు- 21.84 శాతం
  • అపహరణలు- 17.9 శాతం
  • అత్యాచారాలు- 7.9 శాతం

నివేదికలోని మరిన్ని అంశాలు..

  • ప్రతి లక్షమంది మహిళా జనాభాలో నేరాల రేటు 2019లో 62.4 శాతంగా ఉంది. 2018లో ఇది 58.8 శాతం.
  • మహిళలపై నేరాల్లో దేశంలో ఉత్తర్​ప్రదేశ్ (59,583 )​ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రాజస్థాన్ (47,550), మహారాష్ట్ర (37,144) ఉన్నాయి.
  • బాలికలపై నేరాల్లోనూ ఉత్తర్​ప్రదేశ్ (7,444)​ మొదటిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (6,402), మధ్యప్రదేశ్​ (6,053) ఉన్నాయి.
  • అత్యాచారాల్లో 5,997 కేసులతో రాజస్థాన్​ ముందుండగా.. ఉత్తర్​ప్రదేశ్​ (3,065), మధ్యప్రదేశ్ (2,485) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: దేశంలో రోజుకు సగటున 79 హత్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.