ETV Bharat / bharat

ఆ 700 మంది సూపర్​ స్ప్రెడర్స్​కు కరోనా పాజిటివ్​

author img

By

Published : May 16, 2020, 9:29 PM IST

అహ్మదాబాద్​లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సామూహిక కరోనా పరీక్షల్లో 700మంది సూపర్​ స్ప్రెడర్స్​కు పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల విక్రయం సహా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వీరి నుంచి అనేక మందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందునే వీరిని సూపర్ స్ప్రెడర్స్​గా పిలుస్తారు.

700 'super spreaders' found coronavirus positive in week
700 మంది సూపర్​ స్ప్రెడర్స్​కు కరోనా పాజిటివ్​

గుజరాత్​లోని​ అహ్మదాబాద్​లో వారం రోజుల్లోనే 700మంది సూపర్​ స్ప్రెడర్స్​కు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ క్వారంటైన్​లో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కూరగాయలు విక్రయించే వారు, కిరాణ దుకాణాలు నిర్వహించే వారు, ఇతర నిత్యావసరాల వ్యాపారాలు చేసే వారిని సూపర్​ స్ప్రెడర్స్ అంటారు. వీరి నుంచి అనేక మందికి వైరస్​ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 7నుంచి 14 వరకు అహ్మదాబాద్​లో పూర్తిగా లాక్​డౌన్ విధించారు. పాలు, ఔషధ దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ వారం రోజుల్లోనే 33,500మంది సూపర్​ స్ప్రెడర్స్​కు స్క్రీనింగ్​ నిర్వహించారు. 12,500 మందికి వైరస్​ పరీక్షలు చేయగా 700మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. వీరందరినీ ఐసోలేషన్​లో ఉంచినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్​ గుప్తా తెలిపారు.

వారం రోజుల విరామం అనంతరం శుక్రవారం నుంచే అహ్మదాబాద్​లో దుకాణాలు తెరుచుకున్నాయి. గతనెలలో 350 మంది సూపర్​ స్ప్రెడర్స్​కు వైరస్​ సోకినట్లు గుర్తించారు అధికారులు. అప్పటి నుంచి మరింత అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఆరోగ్యంగా ఉన్న దుకాణదారులకు హెల్త్ స్క్రీనింగ్ కార్డులు జారీ చేసినట్లు, వారి వద్ద నుంచే సరుకులు కొనాలని ప్రజలకు సూచించారు అధికారులు. 14 రోజుల అనంతరం వారందరికీ మళ్లీ స్క్రీనింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అహ్మదాబాద్​లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు రాజీవ్​. దుకాణాలన్నీ తెరుచుకున్న నేపథ్యంలో ప్రజలందరూ కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అహ్మదాబాద్​లో శుక్రవారం నాటికి 7వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. 473మంది ప్రాణాలు కోల్పోయారు. 4,260మంది కోలుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.