ETV Bharat / bharat

ఆ 503 మంది ఎంపీల ఆస్తుల వివరాలు రహస్యం!

author img

By

Published : Jan 26, 2020, 11:36 AM IST

Updated : Feb 18, 2020, 11:04 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ప్రమాణం చేసిన 90 రోజుల్లో తమ ఆస్తుల వివరాలు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ.. గత ఏడాది డిసెంబర్​ 10 నాటికి 503 మంది లెక్కలు చెప్పలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు తెలిపిన వారిలో అధికారం భాజపా నుంచి అత్యధికంగా 25 మంది ఉన్నారు.

503 MP's yet to give their property details!
ఆ 503 మంది ఎంపీల ఆస్తుల వివరాలు రహస్యం!

ఎన్నికల్లో పారదర్శకత కోసం పార్లమెంట్​లో పలు నియమాలను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు.. తమ ఆస్తుల వివరాలు లోక్​సభ సచివాలయానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే.. 2019 మే లో జరిగిన 17వ లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల్లో 503 మంది.. తమ ఆస్తుల వివరాలను సమయంలోపు అందించలేదు. కేవలం 36 మంది ఎంపీలు తమ, తమపై ఆధారపడే వారి స్థిర, చరాస్తుల వివరాలను తెలియజేశారు.

స.హ చట్టం ద్వారా వెలుగులోకి

లోక్​సభ సభ్యుల ఆస్తుల వివరాలపై ఉత్తరాఖండ్​లోని కాశీపుర్​కు చెందిన నదీమొద్దిన్​ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన దరఖాస్తుకు సమాధానంగా లోక్​సభ సచివాలయం.. 2019 డిసెంబర్​ 10 నాటికి ఎంపీల ఆస్తుల వివరాలను అందించింది.
వివరాలు అందించిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా భాజపాలో 25 మంది, తృణమూల్​ కాంగ్రెస్​-8, బీజేడీ-1, శివసేన-1, ఏఐడీఎంకే నుంచి ఒకరు ఉన్నారు.

కేంద్ర​ మంత్రులు, రాజకీయ పార్టీల సీనియర్​ నేతలు ఇంకా తమ ఆస్తుల వివరాలు తెలియజేయలేదు.

2004 నిబంధనల ప్రకారం..

లోక్​సభ సభ్యుల ఆస్తులు( ప్రాపర్టీ అండ్ డ్యూటీస్ డిక్లరేషన్)-2004 నిబంధనల ప్రకారం.. ఎంపికైన ప్రతి సభ్యుడు ప్రమాణస్వీకారం చేసిన 90 రోజుల్లో తమ స్థిర, చరాస్తుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.

ఏడుగురు ఎంపీలకు మినహాయింపు..

17వ లోక్​సభకు ఎంపికైన సభ్యుల్లో ఏడుగురికి మినహాయింపు ఉంటుంది. కొందరు వివిధ కారణాల వల్ల ప్రమాణ స్వీకారం ఆలస్యంగా చేశారు. ఇందులో ఎల్​జేపీ ఎంపీ ప్రిన్స్​రాజ్​, ఎన్సీపీ ఎంపీ శ్రీనివాస్​ దాదాసాహిబ్​ పాటిల్​, భాజపా ఎంపీ హిమాద్రి సింగ్​, డీఎంకే ఎంపీ డీఎం కతిర్​ 2019 నవంబర్​ 18న ప్రమాణం చేశారు. రామచంద్ర పాసవాన్​.. జులై 21న మరణించారు. అతుల్​ రాయ్​ డిసెంబర్​ 10 వరకు ప్రమాణం చేయలేదు. ఉద్యాన్​ రాజే ప్రతాప్​ సింగ్​ డిసెంబర్​ 14న రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: ప్రపంచ అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో ప్రత్యేకతలెన్నో..

Intro:Body:



 (03:22) 



New Delhi, Jan 26 (IANS) A 24-year-old psychiatrist was found dead in Delhi's five star hotel Taj Ambassador at Khan Market on Friday, the police confirmed on Saturday.



A suicide note has also been recovered from him.



According to DCP (New Delhi district) Eish Singhal, Karan Chandra was staying in the hotel since January 19. On January 20, he had put a 'Do not disturb' board on his door.



On Friday, when Chandra was scheduled to check out but he didn't, then the hotel staff tried to contact him. All calls on his mobile and intercom went unanswered. Thereafter, the staff opened the door with the help of duplicate key and found his rotten body, the DCP said.



Prima facie investigations revealed that Chandra committed suicide following differences between in his parents, Singhal said.



Chandra's father lives in Malviya Nagar. While his mother and sister live in Saket apart from father. The contact numbers of father and sister are also written in the suicide note, he further said.



"The postmortem and viscera report is awaited. It is difficult to say anything concrete before the report comes," Assistant Commissioner of Police Pratibha told IANS.



ACP further said that there is no divorce between his parents. Even after this, both of them are living separately. Chandra used to go to his father sometimes when he had a mind.


Conclusion:
Last Updated : Feb 18, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.