ETV Bharat / bharat

ఫీజు కట్టలేదని 214 మంది ఐఐటియన్ల టెర్మినేషన్​

author img

By

Published : Dec 11, 2020, 5:35 PM IST

ముందస్తు రిజిస్ట్రేషన్​ చేసుకొని ఫీజులు కట్టని దాదాపు 214 మంది విద్యార్థులను టెర్మినేట్ చేసింది ఐఐటీ ధన్​బాద్​. ఇందులో బీటెక్​తో పాటు ఫెలోషిప్​ విద్యార్థులూ ఉన్నారని డీన్​ తెలిపారు. విద్యార్థులకు ఆఖరి అవకాశంగా డిసెంబర్​ 16 వరకు గడువు ఇచ్చారు.

214 IIT students suspended
ఫీజులు కట్టలేదని 214 మంది ఐఐటియన్ల సస్పెన్షన్​

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ) అనుబంధంగా ఉండే ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ మైన్స్​(ఐఎస్​ఎం) ధన్​బాద్​.. 214 మంది విద్యార్థులను టెర్మినేట్ చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి గానూ ఫీజులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం.

214 IIT students suspended
విద్యార్థులను తొలగిస్తూ నోటిఫికేషన్​

ముందస్తు రిజిస్ట్రేషన్​ చేయించుకొని, ఫీజులు చెల్లించని 129 మంది విద్యార్థుల జాబితాను డిసెంబర్​ 9న విడుదల చేశారు కళాశాల డీన్. మిగతా 85 మంది 2020-21 కాలానికి ఎలాంటి రిజిస్ట్రేషన్​ చేసుకోలేదని తెలిపారు. ఇలా మొత్తం 214 మంది విద్యార్థులను తొలగించినట్లు పేర్కొన్నారు.

214 IIT students suspended
తొలగించిన విద్యార్థుల జాబితా

ఇందులో బీటెక్​ విద్యార్థులతో పాటు.. జూనియర్​ రీసెర్చ్​ ఫెలోషిప్​ చేసేవారూ ఉన్నారని ఆయన తెలిపారు.

విద్యార్థులకు డిసెంబర్​ 16 వరకు సమయం ఉందని, వారు తిరిగి చేరాలనుకుంటే ఓ దరఖాస్తును నింపి సెనేట్​కు సమర్పించాలని డీన్​ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.