ETV Bharat / bharat

అమెరికా నుంచి 100వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్​..

author img

By

Published : Jun 13, 2020, 10:21 PM IST

అమెరికా నుంచి 100 ఉన్నత సాంకేతిక వెంటిలేటర్లు భారత్​కు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాటికి అవి ఇక్కడకు చేరుకుంటాయన్నారు. కరోనాపై పోరులో భాగంగా 100 వెంటిలేటర్లను భారత్​కు సాయంగా అందిస్తామని గత నెలలో హామీ ఇచ్చారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

100 american ventilators to arrive in india on monday
ట్రంప్​ చెప్పినట్లు అమెరికా నుంచి 100వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్​..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇచ్చిన హమీ మేరకు 100 వెంటిలెేటర్లను భారత్​కు పంపుతున్నారని అధికారులు తెలిపారు. సోమవారం రోజు అవి దేశానికి చేరుకుంటాయని చెప్పారు. ఎయిర్​ ఇండియా విమానం వీటిని తరలిస్తోందన్నారు. వీటి నిర్వహణ బాధ్యత రెడ్​ క్రాస్ సొసైటీ చూసుకుంటుందని పేర్కొన్నారు.

కరోనాపై పోరులో వెంటిలేటర్ల పాత్రే అత్యంత కీలకం. ఆరోగ్యం విషమించిన రోగులకు ప్రాణాధారంగా ఉంటాయి. అమెరికా పంపుతున్న 100 ఉన్నత సాంకేతికత వెంటిలేటర్లను ఆ దేశానికి చెందిన జోల్​ సంస్థ తయారు చేసింది.

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు భారత్​కు విరాళంగా అమెరికా 100 వెంటిలేటర్లు అందిస్తుందని మే 16న ట్వీట్ చేశారు ట్రంప్. స్పందనగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.