ETV Bharat / bharat

ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుంది: సుచిత్ర ఎల్ల

author img

By

Published : Mar 4, 2023, 7:50 PM IST

Updated : Mar 4, 2023, 8:12 PM IST

Suchitra Ella in global investor summit: అతి తక్కువ కాలంలోనే ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని... కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ సదరన్‌ రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ సుచిత్ర ఎల్ల అన్నారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు హాజరైన ఆమె, పరిశ్రమల ప్రోత్సాహకాల్లో ఏపీ ప్రభుత్వ సహకారంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఏపీ పటిష్ఠంగా ఉన్నట్లు సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలన్న ఆమె.. అనతికాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు.

Suchitra Ella
సుచిత్ర ఎల్ల

CCI Southern Region Chairperson Suchitra Ella: విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీగా ఏర్పాటైన జీఎస్ఐ ప్రాంగణంలో ప్రారంభమైన పెట్టుబడిదారుల సదస్సు రెండు రోజు.. కొలాహలంగా జరిగింది. తొలిరోజున దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు సందడి మరుసటి రోజు కొనసాగింది. ఫార్మా, గ్రీన్ కో, వంటిరంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ, ( సీఐఐ సదరన్‌ రీజియన్‌ ఛైర్‌పర్సన్‌) సుచిత్ర ఎల్ల మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాన్ని కొనియాడారు.

తక్కువకాలంలో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని సుచిత్ర ఎల్ల అన్నారు. కీలక రంగాల్లో ఏపీ ప్రగతి బాగుందని వెల్లడించారు. విశాఖ జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూడటం ప్రశంసనీయమని ఆమె వెల్లడించారు. దేశ ప్రగతిలో రాష్ట్రాం కీలక భాగస్వామ్యం వహిస్తున్నట్లు సుచిత్ర ఎల్ల తెలిపారు. సీఎం జగన్‌ సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఆమె ప్రశంసించారు.

ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పలు కీలకరంగాల్లో ఏపీ పటిష్టంగా ఉందని సుచిత్ర ఎల్ల తెలిపారు. గత కొంత కాలంగా అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సుచిత్ర ఎల్ల తెలిపారు. సీఐఐ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అంకుర సంస్థలకు ఆంధ్రప్రదేశ్​లో అవకాశాలు ఉత్తమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సుచిత్ర ఎల్ల తెలిపారు. ఏపీ తీసుకు వచ్చిన కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ అనేక అవకాశాలు కల్పిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అంకురాలకు ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ గ్లొబల్ ఇన్వెస్టర్స్‌ సదస్సును ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించినట్లు సుచిత్ర ఎల్ల వెల్లడించారు.

'సీఐఐకి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ కీలక పరిశ్రమల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాం. రాబోయే 25 ఏళ్లకుగాను జిల్లాల విజన్‌ డాక్యుమెంటరీల రూపకల్పన కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సుకతతో ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సాధికారత కోసం మరింతగా కృషి చేసి వారి జీవన ప్రమాణాలను పెంచుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఎంఎస్‌ఎంఈల పటిష్టానికి, స్టార్టప్‌ల ఎదుగుదలపైనా దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులోనూ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ... ముఖ్యమంత్రి విజన్‌ని నిజం చేసేలా కృషి చేస్తాం. సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు, యువత, ప్రజల సమ్మిళిత అభివృద్ధికి పాటుపడతాం.'- సుచిత్ర ఎల్ల, సీఐఐ సదరన్‌ రీజియన్‌ ఛైర్‌పర్సన్‌

సుచిత్ర ఎల్ల, భారత్‌ బయోటెక్‌ ఎండీ

ఇవీ చదంవడి:

Last Updated :Mar 4, 2023, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.