ETV Bharat / bharat

మమతకు పోటీగా ప్రియాంక నామినేషన్​

author img

By

Published : Sep 13, 2021, 1:21 PM IST

Updated : Sep 13, 2021, 1:49 PM IST

బంగాల్​లో భవానీపుర్(Bhabanipur By Election)​ అసెంబ్లీ స్థానానికి సోమవారం నామినేషన్​ వేశారు భాజపా అభ్యర్థి(Bhabanipur Bjp Candidate) ప్రియాంక తిబ్రివాల్(Priyanka tibrewal)​. ఈ నెల 30న ఇక్కడ పోలింగ్​ జరగనుంది. అక్టోబర్​ 3న ఫలితం ప్రకటించనున్నారు.

Bhabanipur by-polls
భవానీపుర్ ఉపఎన్నిక

బంగాల్​ ముఖ్యమంత్రి(West Bengal Cm) మమతా బెనర్జీపై భవానీపుర్​ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో(Bhabanipur By Election)​ భాజపా అభ్యర్థిగా(Bhabanipur Bjp Candidate పోటీకి దిగుతున్న.. ప్రియాంక తిబ్రివాల్​(Priyanka tibrewal) సోమవారం నామినేషన్ వేశారు. కోల్​కతాలోని సర్వే బిల్డింగ్​కు బంగాల్​ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో(Suvendu Adhikari) కలిసి చేరుకున్న ప్రియాంక.. నామపత్రాల సమర్పణ ప్రక్రియ పూర్తిచేశారు.

Bhabanipur by-polls
బంగాల్ ప్రతిపక్ష నేత సవేందు అధికారి సమక్షంలో నామినేషన్ వేస్తున్న ప్రియాంక
Bhabanipur by-polls
నామపత్రాలు సమర్పిస్తున్న ప్రియాంక తిబ్రివాల్​
Bhabanipur by-polls
సంతకం చేస్తున్న ప్రియాంక

ఏప్రిల్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి పోటీచేసిన బంగాల్ ముఖ్యమంత్రి మమత(West Bengal Cm) అప్పుడు ఓడిపోయారు. అయినా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దీదీ.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవానీపుర్​ నుంచి ఎన్నికైన సోబన్​దేవ్​ ఛటోపాధ్యాయ రాజీనామా చేయగా.. ఉపఎన్నిక(Bhabanipur By Election) నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.

ఈ క్రమంలో దీదీపై ఎవరు పోటీకి దిగుతారన్న అంశంపై స్పష్టతనిచ్చిన భాజపా.. న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్​ను(Priyanka tibrewal) తమ అభ్యర్థిగా ప్రకటించింది.

భవానీపుర్​లో ఈ నెల 30న పోలింగ్​ జరగనుంది. అక్టోబర్​ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

తిబ్రీవాల్​ గురించి ముఖ్యమైన అంశాలు...

  • ప్రియాంక తిబ్రీవాల్​ 1981, జులై 7న కోల్​కతలో జన్మించారు. పాఠశాల విద్యను వెల్లాండ్​ గౌల్డ్​స్మిత్​ స్కూల్​లో పూర్తి చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 2007, కోల్​కతా విశ్వవిద్యాలయం పరిధిలోని హజ్రా లా కళాశాల నుంచి న్యాయ విద్య పట్టా అందుకున్నారు. అలాగే థాయిలాండ్​లోని అసంప్సన్​ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై, భాజపా నేత బాబుల్​ సుప్రియో సూచనలతో 2014లో కాషాయ పార్టీలో చేరారు ప్రియాంక తిబ్రీవాల్​. సుప్రియోకు లీగల్​ అడ్వైజర్​గా వ్యవహరిస్తున్నారు.
  • 2015లో కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో వార్డు నంబర్​ 58లో(ఎంటల్లీ) భాజపా టికెట్​పై పోటీ చేశారు ప్రియాంక. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వపన్​ సమ్మద్దర్​పై ఓటమిపాలయ్యారు.
  • 2020, ఆగస్టులో బంగాల్​ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ప్రియాంక. ఈ ఆరేళ్ల కాలంలో తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
  • ఈఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ప్రియాంక. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్​ సాహాపై 58,257 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇదీ చూడండి: భవానీపుర్​లో మమత ఎన్నిక లాంఛనమేనా?

Last Updated : Sep 13, 2021, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.