బార్క్‌లో 4,374 ఉద్యోగాలకు నోటిఫికేషన్​.. జీతం ఎంతో తెలుసా?

author img

By

Published : May 12, 2023, 3:31 PM IST

barc recruitment 2023

BARC Recruitment 2023 : నిరుద్యోగులకు గుడ్​న్యూస్​. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) 4,374 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు జీతం ఎంతో? విద్యార్హత ఏంటో? ఓ సారి తెలుసుకుందామా మరి.

BARC Recruitment 2023 : ముంబయిలోని బాబా అణు విద్యుత్తు పరిశోధన కేంద్రం (BARC)లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 4,374 టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఏఏ పోస్టులంటే..?
టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-1, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

దరఖాస్తు వివరాలు..
ఏప్రిల్ 22న నోటిఫికేషన్ జారీ చేయగా.. అదే నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. మే 22వ తేదీ రాత్రి 12 గంటలతో దరఖాస్తు గడువు ముగియనుంది. మరి కొద్ది రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండడం వల్ల.. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

పోస్టుల వివరాలిలా..
BARC jobs 2023 : మొత్తం 4,374 పోస్టుల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 181 ఉండగా.. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 07, టెక్నిషియన్ బాయిలర్ అటెండెంట్ పోస్టులు 24, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-1 పోస్టులు 1216, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-2 పోస్టులు 2946 ఉన్నాయి.

విద్యార్హతలు ఏంటంటే..?
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత రంగంలో ఎమ్మెస్సీ లేదా బీటెక్‌ చదివి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఫుడ్/హోమ్ సైన్స్/న్యూట్రిషన్ విభాగంలో బీఎస్సీ కలిగి ఉండాలి. ఇక టెక్నిషియన్ బాయిలర్ అటెండెంట్ పోస్టులకు టెన్త్‌తో పాటు బాయిలర్ అటెండెండ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-1 పోస్టులకు సంబంధింత విభాగంలో బీఎస్సీ, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-2 పోస్టులకు టెన్త్/ఇంటర్/ ఐటీఐ చేసి ఉండాలి.

వయో పరిమితి..

  • టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 2023 మే 22వ తేదీకి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.
  • సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
  • టెక్నికల్ బాయిలర్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-1 పోస్టులకు 19 నుంచి 24 , స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-2 పోస్టులకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారానే మాత్రమే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. https://www.barc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలు, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
ఫీజు వివరాలు..
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.500, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.150, టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ పోస్టులకు రూ.150, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-1 పోస్టులకు రూ.150, స్టైపెండియరీ ట్రైనీ క్యాట్-2 పోస్టులకు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతభత్యాలు..
టెక్నికల్ ఆఫీసర్(లెవల్ 10) ఉద్యోగులకు రూ.56,100, సైంటిఫిక్ అసిస్టెంట్(లెవల్ 6) ఉద్యోగులకు రూ.35,400, టెక్నీషియిన్ బాయిలర్ అటెండెంట్(లెవల్ 3) ఉద్యోగులకు రూ.21,700 ఉంటుంది. ఇక స్టైపెండియరీ ట్రైనీ క్యాట్ ఉద్యోగులకు రూ.26 వేలకు వరకు స్ట్రైఫండ్ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:
ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.