ETV Bharat / bharat

అత్యాచారం విఫలయత్నం.. రైలు నుంచి యువతిని తోసేసి..

author img

By

Published : Apr 30, 2022, 6:50 PM IST

rape
rape

Woman Thrown Out of Train: కదులుతున్న రైలు నుంచి యువతిని తోసేశాడు ఓ దుండగుడు. అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించిన కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్​ ఛత్తర్​పుర్​లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Woman Thrown Out of Train: అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకు కదులుతున్న రైలు నుంచి ఓ యువతిని తోసేశాడు దుండగుడు. మధ్యప్రదేశ్​ ఛత్తర్​పుర్​ పరిధిలోని రాజ్​నగర్​లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖజురహో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ బాందా జిల్లాకు చెందిన యువతి మధ్యప్రదేశ్ నుంచి ఖజురహో- మెహోబా ప్యాసింజర్​ రైలులో సొంతూరుకు ప్రయాణమైంది. రైలులోని తోటి ప్రయాణికుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రైలు కదలగానే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో ప్రతిఘటించిన బాధితురాలు తనను తాను రక్షించుకునేందుకు నిందితుడి చేయి కొరికింది. దీంతో కోపం పట్టలేని నిందితుడు బాధితురాలిని తీవ్రంగా కొట్టాడు. ఆమె జట్టు పట్టి ఈడ్చుకుంటూ డోర్​ వద్ద తీసుకొచ్చి రైలు నుంచి తోసేశాడు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

కట్నం తేలేదని బంధువులతో అత్యాచారం: కట్నం తేలేదన్న కారణంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను బంధువులతో అత్యాచారం చేయించాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతానంటూ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ భరత్‌పుర్‌లోని కామాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి 2019లో వివాహం జరిగింది. ఆనాటినుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల భార్యకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చిన భర్త.. బంధువులతో చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. తనను ఐదు రోజుల క్రితం నిందితుల్లో ఒకరు తీసుకొచ్చి మరోసారి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులతో వాపోయింది. అక్కడినుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్నట్టుగా ఫిర్యాదులో వివరించింది. ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన భర్త కట్నం డబ్బులు దానితో సంపాదిస్తానని బెదిరించినట్టుగా ఆరోపించింది. ఈ ఘటనలో ఆమె భర్త సహా మరో ఇద్దరు బంధువులపై కేసు నమోదైంది.

ఇదీ చూడండి : 15 ఏళ్లుగా నాణేలు పోగుచేసి స్కూటీ కొనుగోలు.. లెక్కించలేక తంటాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.