ETV Bharat / bharat

నేపాల్​ నుంచి అయోధ్యకు 1100 కానుకలు- మంచం, టేబుల్​, కుర్చీ సైతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 7:23 PM IST

Updated : Jan 6, 2024, 7:31 PM IST

Ayodhya Ram Mandir Nepal Gifts : అయోధ్య రాముడికి నేపాల్ నుంచి 1100 కానుకలు వచ్చాయి. నేపాల్​లోని జానకి మందిర్ పూజారి రామయ్యకు బట్టలు, ఆభరణాలు, వెండి పాత్రలు సహా పలు వస్తువులను రామజన్మభూమి తీర్థ్​ క్షేత్ర ట్రస్ట్​కు అందించారు.

Ayodhya Ram Mandir Nepal Gifts
Ayodhya Ram Mandir Nepal Gifts

Ayodhya Ram Mandir Nepal Gifts : అయోధ్యలో మరికొద్ది రోజుల్లో రామ్​లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసింది రామజన్మభూమి తీర్థ్​ క్షేత్ర ట్రస్ట్​. కాగా, సీతాదేవి పుట్టిన ప్రదేశమని ప్రజలు నమ్ముతున్న నేపాల్​లోని జనక్​పుర్ నుంచి తెచ్చిన 1100 కానుకలను రామజన్మభూమి తీర్థ్ ​క్షేత్ర ట్రస్ట్​కు అందించారు జానకి దేవాలయ పుజారి మహంత్ రామ్ రోషన్. ఆయన శుక్రవారం నేపాల్​ నుంచి బయలుదేరి శనివారం అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ రామ జన్మభూమి తీర్థ్ ​క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​కు బట్టలు, ఆభరణాలు, వెండి పాత్రలు, ఇతర వస్తువులను అందించారు.

Ayodhya Ram Mandir Nepal Gifts
రామయ్యకు నేపాల్ నుంచి కానుకలు

రాముడి విగ్రహాన్ని అయోధ్యలో మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠనుండడం పట్ల జనక్​పురి ప్రజలు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లోని జానకి ఆలయం నుంచి చీరలు, ధోతీ, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, పలు రకాల మిఠాయిలు పంపించారు. ఇప్పటికే నేపాల్ నుంచి అయోధ్య రామాలయానికి సాలిగ్రామ రాయి, పవిత్ర జలం చేరాయి. కాగా జనవరి 22న జరిగే రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలని రామ్​ జానకి ఆలయం, పశుపతినాథ్ ఆలయం పూజారులు సహా సాధువులకు ఆహ్వానం పంపింది ఆలయ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్.

'భారీ ధ్వజస్తంభం ఏర్పాటు'
గుజరాత్​లోని అహ్మదాబాద్​లో తయారుచేసిన ధ్వజస్తంభాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేయనున్నారు. గోటా ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో 7 ధ్వజస్తంభాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో ప్రధాన ధ్వజస్తంభం బరువు 5500కిలోలు కాగా, ఎత్తు 44అడుగులు. ఈ స్తంభం కాకుండా మిగతా ఆరు 20 అడుగుల ఎత్తు, 700 కిలోల బరువైనవి.

'100శాతం పూర్తైన గర్భగుడి నిర్మాణం'
మరోవైపు రామ్​ లల్లా గర్భగుడి నిర్మాణ పనులు 100 శాతం పూర్తయ్యాయని ఇంజనీర్ ప్రన్షు గెహ్లాట్ చెప్పారు. ఆ గర్భగుడిని అందంగా ముస్తాబు చేస్తున్నామని తెలిపారు. గర్భగుడిలో పలు దేవతామూర్తుల విగ్రహాలను పాలరాతితో చెక్కామని అన్నారు.

'అయోధ్య నుంచి వారణాసికి రామజ్యోతి'
రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు(జనవరి 22)న అయోధ్య నుంచి ఇద్దరు ముస్లిం మహిళలు రామ జ్యోతితో వారణాసికి రానున్నారు. కాశీకి చెందిన నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్వీన్ అనే ఇద్దరు ముస్లిం మహిళలు చాలా ఏళ్లుగా రామభక్తులుగా ఉన్నారు. ఈ రామజ్యోతి గంగా-జమున సంస్కృతికి ఉదాహరణగా మారుతుందని వారు చెప్పారు.

ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం- ఆ శిల్పిదే ఫైనల్​!

ఇనుము లేకుండానే రామమందిర నిర్మాణం- 21 అడుగుల గ్రానైట్ పునాది- 'అయోధ్య అద్భుతాలు' ఇవే

Last Updated : Jan 6, 2024, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.