ETV Bharat / bharat

డ్రగ్స్ దందా గుట్టు రట్టు.. 2.50లక్షల మత్తు మాత్రలు సీజ్

author img

By

Published : Nov 28, 2021, 4:39 AM IST

మాత్రల రూపంలో ఉన్న డ్రగ్స్​ను అసోం పోలీసులు సీజ్(drugs seized) చేశారు. ఘటనలో అరెస్టైన వ్యక్తి వద్ద నుంచి సుమారు 2.5లక్షల డ్రగ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్​లో దాదాపు రూ.13కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో ఉప్పు బస్తాల వెనుక ఉంచి గంజాయిని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

drugs
డ్రగ్స్

అసోంలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రూ.12.96 కోట్ల రూపాయల విలువైన 2.59 లక్షల 'యాబా' టాబ్లెట్‌లుగా పిలిచే ఈ మాదకద్రవ్యాలను కరీంగంజ్ అనే ప్రాంతం​లో స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం నుంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసోం పోలీసులు, సరిహద్దు దళం(బీఎస్​ఎఫ్) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.

drugs
మాదకద్రవ్యాలు

'యాబా' అనేది మెథాంఫేటమిన్ అనే రసాయనంతో తయారయ్యే పదార్థం. శక్తిమంతమైన ఈ డ్రగ్​ తీసుకున్నవారు దీనికి వ్యసనంగా మారుతారని పోలీసులు తెలిపారు. తూర్పు ఆసియాలో ఈ ఔషధం పెద్దఎత్తున ఉత్పత్తి అవుతోంది. అమెరికాలో స్థిరపడిన ఆసియా వాసుల్లో కొందరు తమ రేవ్ పార్టీల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారని వివరించారు.

drugs
మాదకద్రవ్యాలు

425 కిలోల గంజాయి..

ఝార్ఖండ్‌ తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో 425 కిలోల గంజాయితో పాటు.. ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పోలీసు సిబ్బంది అరెస్టు చేశారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానంగా ఎదురుపడిన వీరిని అరెస్టు చేయగా గంజాయి అక్రమరవాణా విషయం వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు.

"ఒడిశా నుంచి ఝార్ఖండ్‌కు గంజాయి స్మగ్లింగ్ జరిగుతోందన్న పక్కా సమాచారం మేరకు రాంచీలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), పోలీసు బృందాలు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించాం. ఒడిశా నుంచి వస్తున్న ట్రక్కులో నిషేధిత మాదకద్రవ్యాలను గుర్తించాం. పోలీసులకు అనుమానం రాకుండా ఉప్పు బస్తాల వెనుక దీనిని దాచి ఉంచారు."

---పోలీసులు

ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్​తో పాటు, మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.